నాచురల్ స్టార్ నాని ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. మరోవైపు స్వయంగా సినిమాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నిర్మాణంలో ఓ రెండు సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక లేటెస్ట్గా హిట్ సినిమాకు సీక్వెల్ ’గా హిట్ 2వస్తోంది. ఈ సినిమా టీజర్స్‌తో పాటు ప్రచార చిత్రాలతో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. Photo : Twitter
ఇక లేటెస్ట్గా ఈ సినిమాకు మరో పార్ట్ అంటే హిట్ 3 కూడా రానుందని సమాచారం. ఒక్కో పార్ట్‌లో ఒక్కో కేసును హీరో చేధిస్తుంటాడు. ఈ హిట్‌వర్స్‌లో ఇక లేటెస్ట్’గా నాని, అడివి శేష్‌తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా నటించనున్నారట. హిట్ 3 వస్తున్న ఈ సినిమా అమెరికా నేపథ్యంలో రానుందని, ఈ సినిమాకు కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. నాని ఇటీవల అంటే సుందరానికీ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చి మెప్పించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరువాలేదనిపించింది. ఇక గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy )మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు నాని. Photo : Twitter
అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఓకే అనిపించుకున్నాయి. ఇక అది అలా ఉంటే నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ (Nani Keerthy Suresh Dasara )సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తున్నారు. Photo : Twitter
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా వస్తోంది. ఈ సినిమా నుంచి దసరా పండుగ సందర్భంగా ఓ మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ధూమ్ ధామ్ దోస్తానా అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌ని దసరా కానుకగా విడుదల చేశారు. సంతోష్ నారాయణన్ అందించిన ఈ క్రేజీ సాంగ్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. Photo : Twitter
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో పాటు టీజర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్లో వస్తాయి.. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే కలెక్షన్స్ విషయంలో కేకపెట్టిస్తుంది అని ట్రేడ్ వర్గాల టాక్. చూడాలి మరి ఎం జరుగుతుందో.. ఈ సినిమా ( Dasara Release date ) 30 మార్చి, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. నాని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమాలో ఓ పల్లెటూరి పాత్రలో నటిస్తున్నారు. Photo : Twitter
సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్నఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. Photo : Twitter
దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో పాటు ఈ సినిమా స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది. Photo : Twitter
‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది. ఈ లుక్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు నాని. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్ని కూడా నియమించుకున్నాడట నాని. Photo : Twitter
ఇక నాని లేటెస్ట్ సినిమా అంటే సుందరానికీ సినిమా విషయానికి వస్తే.. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. సుందర్, లీలా థామస్ పాత్రల్లో నాని, నజ్రియా నజీమ్‌లు అదరగొట్టారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. మంచి అంచనాల నడుమ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter