ఒకప్పుడు తెలుగు హీరోలు ..హిందీలో నటిస్తే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ ఇపుడు బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.తెలుగు సహా సౌత్ ఇండస్ట్రీలో ఇపుడు బాలీవుడ్ హీరోలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి వంటివాళ్లు తెలుగులో నటించారు. ఇపుడు అజయ్ దేవ్‌గణ్ ఆర్ఆర్ఆర్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. వీళ్ల కంటే ముందు తెలుగులో నటించిన బాలీవుడ్ హీరోలు ఇంకెవరున్నారంటే.. (File/Photos)
కేజీఎఫ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2లో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. అంతకు ముందు సంజు బాబా నాగార్జున హీరోగా నటించిన ‘చంద్రలేఖ’లో కాసేపు తెరపై కనిపించిన సంగతి తెలిసిందే కదా. తెలుగులో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో పాటు బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాతో పాటు చిరంజీవి లూసీఫర్ రీమేక్‌లో కూడా విలన్‌గా సంజయ్ దత్ పేరును పరిశీలిస్తున్నారు. (Twitter/Photo)