ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీ నడుపుతున్న చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ సంస్థలో పెట్టుబడి పెడితే లాభాల్లో వాటా ఇస్తామని చెప్పడంతో స్నేహ వారి కంపెనీలో రూ.26 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిందట. అయితే, ఇంతకీ వాటా ఇవ్వకపోగా.. కనీసం తన డబ్బుకు వడ్డీ అయినా ఇవ్వాలని కోరిందట. (Image Credit : Instagram)
కానీ, ఆ ఇద్దరి వ్యక్తుల నుండి ఎలాంటి సమాధానం లేకపోగా ఇప్పుడు చివరికి స్నేహ ఇచ్చిన రూ.26 లక్షలు అసలు కూడా తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది.తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బును తిరిగి ఇవ్వాలని గట్టిగా అడిగితే తనను బెదిరిస్తున్నారని స్నేహ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తుంది. (Image Credit : Instagram)
స్నేహ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు. స్నేహ సినిమాల విషయానికి వస్తే నాగార్జున రాజన్న సినిమా తర్వాత హీరోయిన్ గా దూరమైన స్నేహ సన్నాఫ్ సత్యమూర్తి, వినయవిధేయరామ సినిమాలతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది. కాగా ప్రస్తుతం స్నేహ షూట్ బూట్ 3 సినిమాలో నటిస్తుంది. (Image Credit : Instagram)