కాటమరాయుడు తరువాత తెలుగు తెరపై కనిపించని శ్రుతి హాసన్... మళ్లీ తెలుగులో నటించేందుకు సిద్ధమవుతోంది. రవితేజ హీరోగా తెరకెక్కబోయే కొత్త సినిమాలో ఈ అందాల భామకు ఛాన్స్ దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. గతంలో రవితేజ శ్రుతి హాసన్ కలిసి నటించిన బలుపు సినిమా మంచి విజయం సాధించింది. దీంతో మరోసారి శ్రుతిని రవితేజ ఆదుకుంటాడేమో అని టాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి.