HEROINE MEENA FIRST REACTION AFTER HER HUSBAND VIDYASAGAR DEATH
Meena: భర్త మరణం తర్వాత తొలిసారి స్పందించిన మీనా.. ఆమె ఏమని చెప్పిందంటే..!
Meena husband Death: భర్త మరణం తర్వాత తొలిసారి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ కామెంట్స్ చేసింది మీనా. తన భర్త విద్యాసాగర్ మృతిపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై ఆమె విచారం వ్యక్తం చేస్తూ ఓ సందేశం పోస్ట్ చేసింది.
సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం అంతా ఉలిక్కిపడ్డారు. గత కొంతకాలంగా ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల క్రితం (బుధవారం రోజు) చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
2/ 9
విద్యాసాగర్ మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు మీనా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యాసాగర్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం మూడు నెలలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని మీనా సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు.
3/ 9
అయితే భర్త మరణం తర్వాత తొలిసారి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ కామెంట్స్ చేసింది మీనా. తన భర్త విద్యాసాగర్ మృతిపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై ఆమె విచారం వ్యక్తం చేస్తూ ఓ సందేశం పోస్ట్ చేసింది.
4/ 9
మీనా భర్త విద్యాసాగర్ మృతికి కారణాలివే అంటూ బోలెడన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కొందరు పావురాలు కారణం అని అంటుంటే ఇంకొందరు వేరే వేరే కారణాలు చెబుతూ వార్తలు సృష్టిస్తున్నారు. దీనిపైనే తాజాగా మీనా రియాక్ట్ అయింది.
5/ 9
ప్రస్తుతం తాను భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నానని, ఈ సమయంలో తన కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి అని వేడుకుంది మీనా. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి అంటూ ఆమె అభ్యర్థించింది. దయచేసి విద్యాసాగర్ మృతిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరింది.
6/ 9
భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించిన వైద్యులు, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్, సన్నిహితులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టింది మీనా. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
7/ 9
కాగా మీనా భర్త విద్యాసాగర్ మృతిపై ప్రముఖ కొరియోగ్రాఫర్, మీనా స్నేహితురాలు కళా మాస్టర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కరోనా రాకముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ ఉందని, తన భర్తను కాపాడుకోవడానికి మీనా శతవిధాలా ప్రయత్నాలు చేసిందని కళా మాస్టర్ అన్నారు.
8/ 9
ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబసభ్యులు కరోనా బారిన పడి కోలుకున్నారు. మీనా, భర్త విద్యాసాగర్ ఆమె కుమార్తె నైనికా, కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని విద్యాసాగర్ మరణించారు.
9/ 9
ఒకానొక సమయంలో తెలుగు తెరపై స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది మీనా. విద్యాసాగర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మెల్లగా సినిమాలకు దూరమై కుటుంబ బాధ్యతలు చూసుకుంది. రీసెంట్గా దృశ్యం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి గుండెల్ని పిండేసింది.