Naga chaitanya: ఐ లవ్ నాగ చైతన్య.. పెళ్లిపై కుండబద్దలు కొట్టేసిన యంగ్ హీరోయిన్
Naga chaitanya: ఐ లవ్ నాగ చైతన్య.. పెళ్లిపై కుండబద్దలు కొట్టేసిన యంగ్ హీరోయిన్
Divyansha Kaushik | Naga Chaitanya: సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య.. నాలుగేళ్లలోనే తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి చైతూకి సంబంధించిన ఎన్నో విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా నాగ చైతన్యపై యంగ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
సమంతతో విడాకుల తర్వాత అక్కినేని నాగ చైతన్యకు సంబంధించిన ఎన్నో విషయాలు చర్చల్లో నిలుస్తున్నాయి. నిజానికి ఆయన కామ్ గోయింగ్ పర్సన్ అయినప్పటికీ సమంతతో విడాకుల ఇష్యూ తర్వాత చైతూపై మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో ఇన్నో రూమర్స్ తెరపైకి వచ్చాయి.
2/ 8
సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య.. నాలుగేళ్లలోనే తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి చైతూకి సంబంధించిన ఎన్నో విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. హీరోయిన్లతో చైతూ సీక్రెట్ ఎఫైర్స్ అంటూ చాలా వార్తలు వచ్చాయి.
3/ 8
యంగ్ హీరోయిన్, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారని.. శోభితను వివాహం చేసుకోవాలని చైతూ ఫిక్సయ్యారని చెప్పుకున్నారు. అయితే ఆ ఎఫైర్ స్టోరీ ఏమైందో ఏమో కానీ.. ఈ మధ్య ‘మజిలీ’ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ వార్తల్లోకి వచ్చింది.
4/ 8
దివ్యాంశ కౌశిక్‌తో నాగ చైతన్య లవ్ ఎఫైర్ నడుస్తుందనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని అన్నారు. అంతేకాదు మజిలీ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో దివ్యాంశకు ఛాన్స్ రావడానికి నాగ చైతన్యనే కారణం అనే టాక్ నడిచింది.
5/ 8
ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి రూమర్లపై స్పందిస్తూ క్రేజీ రియాక్షన్ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్యపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఓపెన్ అయింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
6/ 8
నాగ చైతన్యను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అనే విషయమై రియాక్ట్ అవుతూ.. ఇలాంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటూ కుండబద్దలు కొట్టారు. కాకపోతే అతనిపై క్రష్ ఉందని చెప్పిన దివ్యాంశ కౌశిక్.. ఐ లవ్ నాగ చైతన్య అనేసింది.
7/ 8
చూడ్డానికి నాగ చైతన్య చాలా బాగుంటారు. అలాగని మా మధ్య ఏదో ఉందని అనుకుంటే పొరపాటు అని దివ్యాంశ కౌశిక్ చెప్పారు. దీంతో నాగ చైతన్య- దివ్యాంశ కౌశిక్ ఎఫైర్ విషయమై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
8/ 8
ప్రస్తుతం సందీప్ కిషన్‌తో కలిసి ‘మైఖేల్’ సినిమాలో చేస్తున్న దివ్యాంశ కౌశిక్.. సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో చిత్రంలో కూడా నటిస్తోంది. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది దివ్యాంశ. తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా ఓకే చేస్తూ ముందుకు వెళుతోంది.