Heroes as OTT: చిరంజీవి టూ బాలకృష్ణ.. ఎన్టీఆర్ టూ రామ్ చరణ్ .. మెగా హీరోల నుంచి నందమూరితో పాటు అక్కినేని, దగ్గుబాటి సహా టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీ హీరోలు కేవలం సినిమాలనే కాకుండా.. ఓటీటీ వేదికగా స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తగ్గేదేలే అంటున్నారు. త్వరలో రానా నాయుడు అంటూ బాబాయి అబ్బాయిలైన రానా నాయుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. (File/Photo)
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, రానా వంటి స్టార్స్ స్మాల్ స్క్రీన్ పై సందడి చేశారు. ఇక నందమూరి నట సింహా బాలకృష్ణ తొలిసారి స్మాల్ స్క్రీన్ ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో హోస్ట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
రానా దగ్గుబాటి నెం. 1 యారీ ప్రోగ్రామ్‌తో స్మాల్ స్క్రీన్ పై అలరించారు. ఇపుడు మరోసారి జెమిని టీవీతో పాటు ‘ఆహా’ ఓటీటీలో అలరించారు. మరోవైపు వెంకటేష్, రానా కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ కోసం చేసారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.మార్చి 10 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు రానుంది. తొలిసారి వెంకటేష్, రానా ఓ వెబ్ సిరీస్‌లో నటించారు. రియల్ లైఫ్ బాబాయి అబ్బాయిలైన వీళ్లిద్దరు ఈ వెబ్ సిరీస్‌లో తండ్రీ కొడుకులుగా అలరించారు. (Twitter/Photo)(Twitter/Photo)
నందమూరి బాలకృష్ణ తొలిసారి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా లో ఓ టాక్ షో చేసి మొదటి ఎపిసోడ్‌తో అదరగొట్టేసారు. తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు ఇంటర్వ్యూల చేసిన విధానం అందరినీ ఆకట్టకుంది. మొత్తంగా ఇంట్లో డజనుకు పైగా మెగా హీరోలున్న అల్లు అరవింద్ ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కు మెగా ఫ్యామిలీ ట్యాగ్ లైన్ చెరపడానికి బాలకృష్ణను హోస్ట్‌గా ఒప్పించి ఈ ప్రోగ్రామ్ చేసారు. అప్పటికే ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన ఆహాకు దక్కని గుర్తింపు ఈ షోతో ఒక్కసారి సబ్స్క్రైబర్స్ పెరిగారు ఆహాకు. ఇక ఆహా రెండో సీజన్ కూడా అదరిపోయింది. (Twitter/Photo)
ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, నాని వంటి హీరోలు స్మాల్ స్క్రీన్ పై సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు అదే రూట్లో నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూస్ సత్తా చాటారు. ఇప్పటికే మోహన్ బాబు, నాని లను సరదగా ఇంటర్వ్యూలు చేసిన బాలయ్య.. సెకండ్ సీజన్లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో చేసిన సరదగా చేసిన ఇంటర్వ్యూలు ప్రేక్షకులను అలరించాయి. (Twitter/Photo)
తొలిసారి స్మాల్ స్క్రీన్ పై బాలయ్య అదరగొట్టారు. ఇప్పటి వరకు ఇలాంటి షోలు చేయని బాలకృష్ణ తొలిసారి ఇలాంటి షో చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.మొత్తంగా బాలయ్య ఎంట్రీతో ఆహా కు సబ్స్క్రైబర్స్ ఓ రేంజ్లో పెరిగాయి. అంతేకాదు దేశంలో నెంబర్ టాక్ షోగా సత్తా చాటింది. అంతేకాదు IMDBలో ఈ టాక్ షో 9.7 /10 రేటింగ్ సాధించి నెంబర్ వన్ టాక్ షోగా హన దేశంలో నిలవడం విశేషం. (Twitter/Photo)
బిగ్‌బాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వంటి రియాలిటీ షోతో ప్రేక్షకులను పలకరించారు. తొలి రెండు మూడు వారాలు ఈ షోకు మంచి టీఆర్పీ సాధించింది. ఆ తర్వాత ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా హాట్ సీట్లో ఉన్నవారితో వారి పర్సనల్ విషయాలతో పాటు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఈ షోపై క్రేజ్ తీసుకొచ్చారు. ఈ షోలో ఓ కంటెస్టెంట్ కోటీ రూపాయలు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. తెలుగు సీజన్లో ఓ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలుచుకోవడం ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నపుడే సాధ్యమైంది. (Jr NTR)
నాగ చైతన్య కూడా తండ్రి నాగార్జున బాటలో ఓటీటీ బాట పడ్డారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. మొత్తం 24-30 ఎపిసోడ్లతో 3 సీజన్లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. ఇందులో రా ఏజెంట్ పాత్రలో కనిపంచనున్నాడు చైతూ. Bangarraju Photo : Twitter
రామ్ చరణ్ .. కూడా ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ కోసం రామ్ చరణ్‌ను సంప్రదించినట్టు సమాచారం. ముందుగా ఓ బాలీవుడ్ స్టార్‌తో ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్‌ను రీమేక్ చేయాలనుకున్నారట. కానీ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్‌కు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అందుకే ఈ సిరీస్‌ను చెర్రీతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీనికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. (File/Photo)
సమంత కూడా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌లో యాంకర్‌గా అలరించింది. ఈ రియాలిటీ ప్రోగ్రామ్ అంతగా సక్సెస్ కాలేదు. ఆ తరువాత సమంత అక్కినేని ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో LTTE ఉగ్రవాది రాజీ పాత్రలో అలరించింది. ఇపుడు అమెజాన్ ప్రైమ్ కోసం మరో వెబ్ సిరీస్ సైన్ చేసింది. (Twitter/Photo)
కమెడియన్ అలీ కూడా ‘ఆలీ తో సరదగా’ ప్రోగ్రామ్‌లో యాంకర్‌గా పలువరు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉన్నారు. సెలబ్రిటీ ఇంటర్వ్యూల్లో ఆలీ తో సరదగా ప్రోగ్రామ్ ఈటీవీలో టాప్ రేటేడ్ ప్రోగ్రామ్‌గా ఇప్పటికీ అదే దూకుడు కొనసాగింది. ఇక ఆలీ ఏపీలో మీడియా సలహాదారుగా నియమితులు కావడంతో ఈ ప్రోగ్రామ్‌కు తాత్కాలికంగా ఎండ్ కార్డ్ వేసారు. (file/photo)