గతంలోనే అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విశాల్.. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ సిస్టర్‌గా నటించిన అభినయను పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తల ప్రవాహం నడుస్తోంది. దీంతో తాజాగా లాఠీ టీజర్ లాంచ్ ఈవెంట్లో తన పెళ్లి విషయమై విశాల్ నేరుగా రియాక్ట్ అవుతూ అసలు విషయం చెప్పేశారు.
ప్రతి దానికి ఓ సమయం వస్తుందని చెప్పిన విశాల్.. తాను ఇచ్చిన మాట నెరవేర్చుకుంటానని అన్నారు. మాట ఇస్తే తప్పను. ఆ మాట పూర్తయ్యే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని విశాల్ అన్నారు. మళ్ళీ చెబుతున్నా.. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ముహుర్తంలోనే తన పెళ్లి జరుగుతుందని తెలిపారు విశాల్.
3500 కుటుంబాలు, థియేటర్ ఆర్టిస్ట్ లు ఇంకా చిరిగిన బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. గత 30 ఏళ్ళ నుంచి వాళ్ళ పరిస్థితిలో మార్పు రాలేదు. వాళ్లంతా బాగుండేలా వాళ్లకు ఓ భవనం కట్టించి, పిన్షన్స్ ఇప్పించి.. వారి జీవన విధానాన్ని మార్చాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నా. ఆ ఆశయం నెరవేరకుండా పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకునేటపుడు మీ అందరికీ చెబుతా.. అందరూ రావాలి అని అన్నారు విశాల్.
ఇక విశాల్ తాజా సినిమా లాఠీ విషయానికొస్తే.. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా లాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్‌కు జోడిగా సునయన హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశారు మేకర్స్.