Niharika: నిహారిక క్యారెక్టర్ అలాంటిది..! మెగా డాటర్‌పై యంగ్ హీరో కామెంట్స్ వైరల్
Niharika: నిహారిక క్యారెక్టర్ అలాంటిది..! మెగా డాటర్‌పై యంగ్ హీరో కామెంట్స్ వైరల్
Konidela Niharika: తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో 7 డేస్ 6 నైట్స్ మూవీ విశేషాలతో పాటు కొణిదెల డాటర్ నిహారిక గురించి మాట్లాడారు సుమంత్ అశ్విన్. ఆమె క్యారెక్టర్ గురించి సుమంత్ అశ్విన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ 7 డేస్ 6 నైట్స్ ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నెల 24న ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఓపెన్ అవుతున్నారు.
2/ 8
ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో 7 డేస్ 6 నైట్స్ మూవీ విశేషాలతో పాటు కొణిదెల డాటర్ నిహారిక గురించి మాట్లాడారు సుమంత్ అశ్విన్. ఆమె క్యారెక్టర్ గురించి సుమంత్ అశ్విన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
3/ 8
తాను నిహారిక కలిసి నటించిన హ్యాపీ వెడ్డింగ్ సినిమాకు మంచి క్రేజ్ వచ్చిందని సుమంత్ అశ్విన్ తెలిపారు. నిహారిక చాలా మంచి వ్యక్తి అని, బాగా నటిస్తుందని అంటూ ఆమె గురించి నాలుగు మాటలు చెప్పారు సుమంత్ అశ్విన్.
4/ 8
తనకు నాగబాబు గారంటే చాలా రెస్పెక్ట్ అని సుమంత్ అశ్విన్ అన్నారు. నిహారిక అందరితో చాలా బాగా మాట్లాడుతుందని, ఆమెకు ఈగో లాంటివి అస్సలుండవని చెప్పారు. అందరికీ ఎనర్జీ వచ్చేలా నిహారిక ప్రవర్తన ఉంటుందని సుమంత్ అశ్విన్ చెప్పడం విశేషం.
5/ 8
కాగా నిహారిక ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటూ సుమంత్ అశ్విన్ ఓపెన్ అయ్యారు. ఓ సమయంలో నిహారిక ఒక హోటల్‌ను చూపించి అక్కడ దెయ్యాలు ఉంటాయని చెప్పి భయపెట్టిందని చెప్పారు.
6/ 8
సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 7 డేస్ 6 నైట్స్ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ సూపర్ రెస్పాన్స్ అందుకొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.
7/ 8
గతంలో 'డర్టీ హరి'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎంఎస్ రాజు ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తికరంగా మారింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, ఎస్.రజనీకాంత్ ఈ సినిమాను నిర్మించారు.
8/ 8
ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా నటించగా.. మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఎంచుకొని ఈ సినిమాను రూపొందించారట.