Hero Siddharth: తెలుగు సినీ నటుడు సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా నటించాడు. కానీ అంత సక్సెస్ అందుకోలేదు. కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరమైన సిద్దార్థ్.. ప్రస్తుతం రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహాసముద్రం సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో శర్వానంద్ కూడా నటిస్తుండగా..అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సిద్ధార్థ్ ఏకంగా రూ.3 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడట. ఇంత పారితోషికం తీసుకుంటునందుకు చాలా మంది షాక్ అవుతున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోల కి ఇంత పారితోషికం లేదని పైగా రీ ఎంట్రీ తో ఇంత పారితోషికం ఎలా తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.