సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక్కొక్కరివీ ఒక్కో రకమైన కష్టాలు. స్టార్ అయ్యాక వాళ్ళ వాళ్ళ లగ్జరీ లైఫ్ చూస్తుంటాం కానీ.. ఆ లైఫ్ కోసం వాళ్ళు అంత కష్టపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది కొంతమందికే తెలుసు. సందర్భం వచ్చినప్పుడు తమ తమ సినీ కెరీర్ కష్టాలను బయటపెడుతుంటారు స్టార్స్. తాజాగా హీరో నాని ఓపెన్ అయ్యారు.
టాలీవుడ్ హీరోలు నాని, రవితేజ ఇద్దరు కూడా గతంలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన వాళ్ళే. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పారు నాని. తనకు ఆఫర్ ఇస్తానని చెప్పి ఒకరిద్దరు కో డైరెక్టర్లు డ్రైవర్ కింద వాడుకున్నారు అని తెలిపారు.
నటుడిగా అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. డ్రెస్సులు కూడా కొనుక్కోకుండా పండుగల కోసమని జాగ్రత్తగా దాచుకున్న డబ్బులు కూడా కొట్టేసేవారు. అలాంటి స్కామ్స్ నేను ఫేస్ చేశా అంటూ నాని ఆవేదన చెందారు. ఇక మళ్లీ మళ్లీ మోసపోవడం తన వల్ల కాదని నటుడిగా ప్రయత్నాలు ఆపేశానని.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారానని చెప్పారు.