నాని (Nani) హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌పై నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు.