తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవే లేదు. ఇక్కడున్న వాళ్లలో 80 శాతం మంది వారసులే ఉన్నారు. అందులో మంచు వారసులు కూడా ఉన్నారు. ఆ కుటుంబం నుంచి కూడా విష్ణు, మనోజ్ వచ్చారు. మోహన్ బాబు నట వారసులుగా వచ్చిన ఈ ఇద్దరూ ఇప్పటి వరకు స్టార్ హీరోలుగా మాత్రం మారలేకపోయారు. 20 ఏళ్ళ ప్రస్థానంలో ఇప్పటి వరకు సరైన విజయాలు మాత్రం రాలేదు.
ఒకట్రెండు విజయాలు వచ్చినా కూడా కోరుకున్న గుర్తింపు రాలేదు. ఇప్పటికీ తమ అస్థిత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు మంచు వారసులు. ముఖ్యంగా విష్ణు అయితే ఢీ, దేనికైనా రెడీ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్న తర్వాత కూడా కెరీర్‌ను అనుకున్న దారిలో సెట్ చేసుకోలేకపోయాడు. వరస సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ విజయాలు మాత్రం రావడం లేదు.
మొన్నటికి మొన్న 50 కోట్లతో నిర్మించానని చెప్పుకున్న మోసగాళ్లు కూడా ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు. భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన మోసగాళ్ళు వచ్చిన రోజే చాప చుట్టేసింది. అయితే తన కెరీర్ ఇంత దారుణంగా ముందుకు వెళ్లడానికి.. ఇప్పటి వరకు స్టార్‌గా గుర్తింపు సంపాదించుకోకపోవడానికి ఆత్మ విశ్లేషణ చేసుకున్నాడు విష్ణు.
నువ్వు కథ ఫైనల్ చేయకుండానే దర్శకుడు ముందుకెళ్తాడా.. నీ తప్పు కూడా ఉంటుంది కదా బ్రదర్ అంటూ విష్ణును ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి సినిమా హిట్టైతే నా వల్ల.. ఫ్లాప్ అయితే దర్శకుడి వల్లే అని చెప్పడం కరెక్ట్ కాదంటూ ఈయనకు కొందరు గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు. మరి దీనికి మంచు వారబ్బాయి ఏమంటాడో చూడాలి.