బిగ్ బాస్ 5 తెలుగు షో చివరికి వచ్చేసింది. మరో రెండు వారాల్లోనే ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం హౌజ్‌లో కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. అందులోంచి ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయిపోతారు. మరో 6గురులో ఒకరు పోయి.. ఐదుగురు ఇంటి సభ్యులు మిగులుతారు. అయితే ఈ క్రమంలోనే ఒకరు నేరుగా ఫైనల్‌కు వెళ్లేలా బిగ్ బాస్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అదే టిక్కెట్ టు ఫినాలే టాస్క్.
నాలుగు దశలుగా జరిగే ఈ టాస్కులో భాగంగా ఏడుగులు సభ్యులు పోటీ పడుతున్నారు. ఈ పోటీ నుంచి ఇప్పటికే షణ్ముఖ్ జస్వంత్, కాజల్, ప్రియాంక సింగ్ అనర్హత సాధించారు. టాస్కుల్లో ఓడిపోయిన కారణంగా వీళ్ళు తప్పుకున్నారు. ప్రస్తుతం సన్నీ, శ్రీరామ్, సిరి, మానస్ టిక్కెట్ టు ఫినాలే కోసం లాస్ట్ రౌండ్ వరకు ఉన్నారు. వీళ్లు ఓ సోఫాలో కూర్చుని టాస్కులో పాల్గొంటున్న సమయంలో కాజల్ వాళ్లను బాగా డిస్టర్బ్ చేసింది.
మరోవైపు షణ్ముఖ్ జస్వంత్, పింకీ మాత్రం కూల్‌గా ఉన్నారు. కాజల్ మాత్రం అందర్నీ డిస్టర్బ్ చేస్తూనే ఉంది. దాంతో అక్కడే ఉన్న సన్నీ.. కాజల్‌పై సీరియస్ అయ్యాడు. సన్నీ బోర్డ్‌పై ఉన్నవి చదువుతోందని బిగ్ బాస్‌కు కంప్లైట్ చేశాడు. అలాగే ఆన్సర్ బయటకి చెప్తుందంటూ శ్రీరామ్ కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో కాజల్ సారీ చెప్తూ అక్కడ్నుంచీ వెళ్లిపోయింది.
కానీ కాజల్ మాట్లాడుతుంటే తనకు ఫోకస్ పోతోందని గట్టిగా అరిచాడు సన్నీ. కానీ అక్కడే ఉన్న కాజల్ మాత్రం అవేం పట్టించుకోలేదు. అరుస్తూనే ఉంది.. అలాగే కనిపించింది. దాంతో మరోసారి సన్నీ సీరియస్ అయ్యాడు. ఫోకస్ పోతుందని.. కామ్‌గా ఉండాలంటూ రెండు మూడు సార్లు కాజల్‌ను కోరిన సన్నీ ఆ తర్వాత అరిచాడు. ఏంట్రా కొడతావా అంటూ కాజల్ కూడా మీదకు వచ్చింది.
అంతేకాదు.. ఈ టిక్కెట్ టూ ఫినాలే టాస్కులో సిరి గెలిచిందని తెలుస్తుంది. ఫైనల్స్‌కి వెళ్లిన ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన గత 4 సీజన్స్‌లో కూడా ఫిమేల్ కంటెస్టెంట్ ఫినాలే టిక్కెట్‌ని గెలవలేదు. కానీ ఐదో సీజన్లో ఇది జరిగినట్లు కనిపిస్తుంది. ఈ టిక్కెట్ టు ఫినాలే మాత్రం ఈ వారం సేఫ్ అవ్వాలి.. అప్పుడే అప్లై అవుతుంది. లేదంటే వేస్ట్ అవ్వక తప్పదు.