ఇండియన్ సినిమాలో ఎంతోమంది దర్శకులున్నారు కానీ ఒక్కడు మాత్రం భిన్నం. ఆయనే రాజమౌళి.. అపజయం అంటూ తెలియని దర్శకుడు.. అది ఎక్కడ తన దగ్గరికి వస్తుందేమో అని అనుక్షణం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేసే దర్శక దిగ్గజం ఈయన. చేసిన అన్ని సినిమాలతో ఆడియన్స్ మనసు గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా అన్నిచోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
సినిమా స్లోగా ఉందనే విమర్శలు వస్తున్నా కూడా రాజమౌళి క్రేజ్ ముందు.. చరణ్, ఎన్టీఆర్ గాలి తుఫాన్ ముందు ఆ టాక్ నిలబడేలా కనిపించడం లేదు. కచ్చితంగా ట్రిపుల్ ఆర్ కూడా కమర్షియల్గా చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల గురించి ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారు. అవేంటో చూద్దాం..
6. ప్రీ క్లైమాక్స్ అలియా భట్, ఎన్టీఆర్ ఎపిసోడ్: సినిమాకు ప్రధానమైన ఆయువుపట్టు లాంటి సన్నివేశం అది. తనలో ఏ స్థాయి దర్శకుడు ఉన్నాడనేది ప్రేక్షకులకు రాజమౌళి గుర్తు చేసే సీన్ అది. ముఖ్యంగా చరణ్ గురించి ఎన్టీఆర్ నిజం తెలుసుకున్న తర్వాత వచ్చే సన్నివేశాలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ఆ తర్వాత క్లైమాక్స్ వైపు పరుగులు పెడుతుంది సినిమా. మొత్తానికి ఈ 6 సీన్స్, సీక్వెన్సులతోనే ఫుల్ పైసా వసూల్ అయిపోయింది ట్రిపుల్ ఆర్ సినిమా.