తెలుగు ఇండస్ట్రీలో ఓ స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారు.. నాలుగేళ్ళ వాళ్ల పెళ్లి ప్రయాణం విడాకులతో ముగిసిపోవడానికి సిద్ధంగా ఉంది.. పెద్ద వాళ్లు ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో వాళ్లు లేరు.. గత 24 గంటలుగా సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారం ఇది. నాలుగేళ్ళ కింద పెళ్లి జరిగింది.. ఇప్పుడు విడాకులకు సిద్ధం అవుతున్నారు అంటూ ఎవరైనా ముందుగా అనుకునే జంట అక్కినేని నాగ చైతన్య, సమంతలదే.
మూడేళ్ళ వాళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా కనిపించారు అక్కినేని జంట. గోవాలో ఓ ఇల్లు కూడా తీసుకున్నారు. అంతేకాదు హైదరాబాద్‌లో కూడా భారీగా ఖర్చు చేసి సొంతంగా నచ్చినట్లు ఓ ఫ్లాట్ కొన్నారు. భవిష్యత్తు గురించి ఎన్నో ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకున్నారు. వాళ్లను చూసి అక్కినేని అభిమానులు మురిసిపోతుంటారు.
ఈ వార్తలు వస్తున్న తరుణంలోనే సమంత చేసిన ఓ పని చూసి అంతా షాక్ అవుతున్నారు. గతేడాది తన పేరు నుంచి అక్కినేని తొలగించి కేవలం సమంత మాత్రమే పెట్టుకుంది. దానికి సమాధానం ఇప్పటి వరకు క్లారిటీగా చెప్పలేదు సమంత. అయితే తాజాగా ఆగస్ట్ 29న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా సమంత విష్ చేసింది. ఇది చూసిన తర్వాత అక్కినేని అభిమానులు కాస్త కుదుట పడ్డారు.
అందులో చాలా ముద్దుగా నాగార్జున మామ అంటూ నోరారా పిలిచింది స్యామ్. అంతేకాదు లవ్ సింబల్స్ కూడా ఇచ్చింది. ఇది చూసిన తర్వాత హమ్మయ్యా.. చై స్యామ్ బాగానే ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నదంతా ఉట్టి ప్రచారమే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు అక్కినేని అభిమానులు. ఇక దీనిపై అధికారికంగా సమంత, చైతూ కూడా స్పందిస్తూ రూమర్స్‌కు పూర్తిగా చెక్ పడుతుందని వాళ్లు భావిస్తున్నారు.