రానా దగ్గుబాటి గురించి అందరికీ అన్నీ తెలిసినట్లే అనిపిస్తుంటుంది కానీ చాలా మందికి ఈయన గురించి చాలా నిజాలు తెలియదు. ఎందుకంటే తెరిచిన పుస్తకంలోనే ఎన్నో రహస్యమైన పేజీలు ఉన్నాయి. రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఈయనకు చాలా ఇమేజ్ ఉంది. చాలా తక్కువ టైమ్‌లోనే తెలుగుతో పాటు హిందీ, తమిళ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి వారసుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ తరం నటులలో పాదరసం లాంటి వాడు రానా. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. అన్నింటికీ సై అంటాడు. ఈయన గురించి కొన్నినిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా తక్కువ సమయంలోనే హిందీలో దమ్ మారో దమ్, డిపార్ట్మెంట్ లాంటి సినిమాలు చేసాడు. తమిళంలో కూడా ఆరంభం లాంటి సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో కృష్ణం వందే జగద్గురుమ్, రుద్రమదేవి, నేనేరాజు నేనేమంత్రి లాంటి సినిమాలతో స్టార్ అయ్యాడు. కెరీర్ పరంగా ఎన్ని సంచలనాలు సృష్టించాడో.. వ్యక్తిగత జీవితంలో కూడా అన్నే అద్భుతాలు చేసాడు రానా.
35 ఏళ్లకే అనారోగ్యం పాలయ్యాడు. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి.. దాంతో ఆర్నెళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ గెలిచి ప్రాణాలతో బయటికి వచ్చాడు. చిన్నపుడే ఓ కంటిని పోగొట్టుకున్నాడు. అలాంటి విషాదాలు కూడా రానా జీవితంలో ఉన్నాయి. చాలా తక్కువ సమయంలోనే రానా ఆదర్శం అయ్యాడు.. వివాదం అయ్యాడు.. అలాగే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు.