సమంత మయోసైటిస్ అనే దీర్ఘకాల కండరాల వ్యాధితో బాధపడుతుంది. తన ఆరోగ్యం బాగాలేదని.. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని.. సామ తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి బారిన పడ్డానని సమంత ప్రకటించినప్పటి నుంచి... సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు ఆవేదనను వ్యక్తం చేశారు. సమంతకు ధైర్యం చెప్పారు.
అయితే సమంత ఆరోగ్యంపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి, ఆమె ఆరోగ్యం క్షీణించిందని .. సామ్ ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మరోసారి సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే దీనిపై సామ్ కుటుంబం, మేనేజర్ క్లారిటీఇచ్చారు. అలాంటిదేం లేదన్నారు.
అయితే ఏ ట్రీట్ మెంట్ తీసుకున్నా సరే.. సమంత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె వ్యాధి నయం అయ్యి ఆమె త్వరగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నారు. సమంత యశోద సినిమా విషయానికి వస్తే.. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు హరి, హరీష్ లు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఇక అది అలా ఉంటే ఆమె మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారు. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. Photo : Twitter