గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమం ప్రస్తుతం కాలిఫోర్నియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా RRR మూవీ రెండు నామినేషన్లతో ఈ అవార్డుల్లో చోటు సంపాదించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ మూవీ కేటగిరీల్లో ఈ మూవీ నామినేట్ కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును కీరవాణి అందుకున్నాడు. ఓ ఇండియన్ సినిమాకు ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి.
అయితే ఈ స్టెప్పులు సరిగ్గా రావడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు 15-18 టేక్స్ తీసుకున్నారట. ఇదే విషయాన్ని హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఇచ్చిన ఇంటర్వూలో ఎన్టీఆర్ పేర్కోన్నారు. ‘నాటు నాటు’లో హుక్ స్టెప్ కోసం 80కి పైగా వేరియేషన్ స్టెప్స్‌ను ప్రేమ్ రక్షిత్ బృందం రికార్డు చేసిందట. చివరకు భుజాలపై చేతులు వేసుకుని ఇద్దరూ ఒకే రకంగా కాళ్లు కదిపే స్టెప్‌ను ఓకే చేశారు.
‘గోల్డెన్ గ్లోబ్’ రావడంతో చిత్రబృందం, భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పాట ‘ఆస్కార్’ షార్ట్‌లిస్ట్‌లోనూ ఉత్తమ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకుంది. ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్ ఆధారంగా జనవరి 24న ఆస్కార్ నామినేషన్లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్ అవార్డులు అందించనున్నారు.