‘కార్తికేయ-2’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా యంగ్ హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా షూటింగ్ అంటే చాలా ఉత్సాహంగా కనిపించే అనుపమ, సినిమా ప్రమోషన్లనగానే గాయబ్ అయిపోతుందంటూ నిఖిల్ వ్యాఖ్యానించాడు.దీంతో ప్రమోషన్లకు హీరోయిన్ రాదంటూ.. అనుపమకు గట్టిగానే చురకలంటించాడు నిఖిల్.
ఉదయం ఐదు గంటలకే షూటింగ్ అన్నా వచ్చేస్తుందనీ.. చాలా ప్రొఫెషనల్‌గా, చాలా ఫ్రెండ్లీగా వుంటుందనీ, సినిమా ప్రమోషన్లంటే ఆమె నుంచి రెస్పాన్స్ వుండదనీ’ నిఖిల్ చెప్పాడు. నిజానికి, అనుపమ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బాగానే కనిపిస్తుంటుంది. ‘కార్తికేయ-2’ సినిమా ప్రమోషన్లలో మాత్రం అనుపమ పెద్దగా కనిపించడంలేదు.