జబర్దస్త్ నటీనటుల్లో తెగ పాపులర్ అయ్యాడు సుడిగాలి సుధీర్. తనదైన హావభావాలకు తోడు రొమాంటిక్ పంచులేస్తూ అమ్మాయిలకు కనెక్ట్ అయి పోయాడు. వేదికపైకి సుధీర్ వచ్చాడంటే చాలు రొమాంటిక్ వైబ్స్ జివ్వుమనిపిస్తాయి.
2/ 8
జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సందడి చేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా చేస్తూ ప్రతి వారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో చురకత్తుల్లాంటి చూపులతో అట్రాక్ట్ చేస్తున్నాడు.
3/ 8
ప్రతి వారం ఎవరో ఒక గెస్ట్‌తో ప్రోగ్రాంపై ఆసక్తి పెంచుతున్న మేకర్స్.. ఈ సారి గ్లామర్ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్‌ని గెస్ట్‌గా పిలిచారు. తాజాగా ఈ వారానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అందులో హెబ్బా హవా కనిపించింది.
4/ 8
ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంని సుడిగాలి సుధీర్, ఇంద్రజ, హైపర్ ఆది తమ భుజాలపై వేసుకొని జబర్దస్త్ లాగే మంచి రేటింగ్ రాబడుతున్నారు. ఇక ఈ ప్రోగ్రాం ప్రోమోస్ అయితే యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తున్నాయి.
5/ 8
ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ప్రోమోలో హీరోయిన్ హెబ్బా పటేల్, సుడిగాలి సుధీర్ నడుమ నడిచిన రొమాంటిక్ మూమెంట్స్ నెటిజన్లకు భలే కిక్కిచ్చాయి. అందరూ చూస్తుండగానే సుధీర్‌కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది బ్యూటీఫుల్ హీరోయిన్ హెబ్బా.
6/ 8
ఆ తర్వాత హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ వచ్చి హెబ్బా పటేల్‌తో ఇంకాస్త రొమాన్స్ పండించారు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి రాగానే ఆనవాయితీ అంటూ ఆమెతో హగ్గులు ఇప్పించుకున్నాడు హైపర్ ఆది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
7/ 8
కుమారి 21 ఎఫ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన హెబ్బా పటేల్.. గ్లామరస్ బ్యూటీగా యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. రీసెంట్గా రామ్ రెడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఊపేసింది.
8/ 8
ఇటీవలి కాలంలో హెబ్బా కెరీర్ కాస్త డౌన్ కావడంతో తిరిగి లైమ్ లైట్ లోకి రావాలని ప్రయత్నిస్తోంది హెబ్బా పటేల్. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలా మెరిసింది.