మరణించి 17 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈమెను మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. చనిపోయేనాటికి సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే.. పైగా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది. 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు.
ఇప్పటికీ ఆ స్కూల్స్‌కు సౌందర్య కుటుంబం ఆర్థిక సాయం చేస్తుంది. అప్పటి లెక్కల ప్రకారమే 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు. తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సౌందర్య. అయితే ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.
ఇప్పటికీ సౌందర్య ఇంటి నుంచి ఆమె స్థాపించిన కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈమె ఆస్తుల గురించి.. ఇళ్ల గురించి ఆమె ప్రాణ స్నేహితురాలు ఆమని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సౌందర్య చనిపోయిన విషయం తాను నమ్మలేకపోయానని.. అయితే సౌందర్య మరణించిన కొన్నాళ్ళకు బెంగళూరులోని ఆమె బంగ్లాకు వెళ్లినట్లు చెప్పింది ఆమని.
సౌందర్య జీవితంలో అత్యంత కీలకంగా ఉన్న 1990 నుంచి 2004 వరకు ఆ 14 ఏళ్లు కీలకంగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు నిత్యా మీనన్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సౌందర్య బయోపిక్ చేస్తారనే కన్నడనాట ప్రచారం జోరందుకుంటుంది.