Rakul Preet Singh: ఈ రోజు (అక్టోబర్ 10) రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు. సో.. ఈ హాట్ బ్యూటీ ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ బిగ్గెస్ట్ సినిమాల్లో భాగం కావాలని కోరుకుంటూ మీ మా News 18 తెలుగు వెబ్ ఛానల్ తరఫున ఆమెకు బెస్ట్ విషెస్ అందిస్తున్నాం.
‘కెరటం’ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే యువ హృదయాల మనసులో చోటు సంపాదించింది రకుల్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి అందరు అగ్ర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. రకుల్ లేలేత అందాలతో వెండితెర తడిసి ముద్దయింది.
2/ 9
అందానికి అందం అందుకు నటనా ప్రతిభ తోడు కావడంతో పంజాబీ పాప రకుల్ కెరీర్ గ్రాఫ్ ఉవ్వెత్తున ఎగిసింది. ఫిట్ నెస్ పరంగా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఏళ్ల తరబడి అందాలతో అట్రాక్ట్ చేస్తోంది రకుల్. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ వరించడంతో అమ్మడికి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
3/ 9
‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’, 'కిక్ 2' వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న రకుల్.. క్రమంగా తన డిమాండ్ ఏంటో తెలుసుకొని రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచేసింది. అయినప్పటికీ రకుల్ డేట్స్ కోసం పోటీపడ్డారు తెలుగు దర్శకనిర్మాతలు.
4/ 9
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే కోణంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో జెండా పాతింది ఈ అందాల తార. ప్రస్తుతం బాలీవుడ్లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె నటించిన రన్‌వే 34, అటాక్ సినిమాలు విడుదలయ్యాయి కానీ పెద్దగా రకుల్ క్రేజ్ పెంచలేకపోయాయి.
5/ 9
ప్రస్తుతం అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వస్తున్న థాంక్ గాడ్లో నటిస్తోంది రకుల్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ హిట్ పట్ల బోలెడన్ని ఆశలు పెట్టుకుంది రకుల్.
6/ 9
తొలుత సౌత్ సినిమాల్లో తన మార్క్ చూపించి ఇప్పుడు తన బర్త్ ప్లేస్ నార్త్ లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది రకుల్. దీంతో అమ్మడి తీరు చూసి రచ్చ గెలిచి ఇంట గెలిచేలా ఈ పంజాబీ పాప తీరు ఉంది అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.
7/ 9
ఇకపోతే ఇటీవల టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం పెద్ద రచ్చకు దారితీసింది. రకుల్ లాంటి హాట్ బ్యూటీ ఈడీ అధికారుల విచారణకు వెళ్లడం హాట్ టాపిక్ అయింది.
8/ 9
ఒకప్పుడు హీరోయిన్గా నటించడానికి ఒక్కో సినిమాకు కోటి 50 లక్షల వరకు అందుకున్నారట రకుల్. కాగా ప్రస్తుతం డైలీ పేమెంట్స్ విధానంలో భాగంగా.. రోజుకు మూడు లక్షలు వరకు తీసుకుంటున్నారని సమాచారం.
9/ 9
ఈ రోజు (అక్టోబర్ 10) రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు. సో.. ఈ హాట్ బ్యూటీ ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ బిగ్గెస్ట్ సినిమాల్లో భాగం కావాలని కోరుకుంటూ మీ మా News 18 తెలుగు వెబ్ ఛానల్ తరఫున ఆమెకు బెస్ట్ విషెస్ అందిస్తున్నాం.