Prabhas - Har Ghar Tiranga : భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 యేళ్లు పూర్తి కావొస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకం ఆగష్టు 13 నుంచి ఆగష్టు 15 వరకు ఎగరేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ ‘హర్ ఘర్ తిరంగ’ పేరుతో ఓ దేశ భక్తి గీతాన్ని విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ సహా ఇతర సెలబ్రిటీలు నటించిన ఈ గీతం వైరల్ అవుతోంది. (Twitter/Photo)
ఈ దేశ భక్తి గీతంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్‌తో పాటు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కపిల్ దేవ్, అనుష్క శర్మ, కీర్తి సురేష్, దేవీశ్రీ ప్రసాద్,అజయ్ దేవ్‌గణ్,అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌తో పాటు పలువురు నటీనటులు, క్రికెటర్స్ పాల్గొని ప్రతి ఒక్కరు ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. (Twitter/Photo)