నటుడిగా 60 ఏళ్ల ప్రస్థానాన్ని కంప్లీట్ చేసుకున్న లోక నాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు నేడు (Twitter/Photo)
నటుడిగా 60 ఏళ్ల క్రితం ‘కలత్తూర్ కన్నమ్మ’ సినిమాతో నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కమల్ హాసన్ (Twitter/Photo)
మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించాడు. కమల్ ఉత్తమంగా నటించడం.. అక్కడి నుంచే మొదలైంది. (Twitter/Photo)
బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీఆర్,జెమినీ గణేషన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశాడు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా పనిచేశాడు. తర్వాత భాషాబేధం పాటించకుండా నటుడిగా వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటించాడు. (Facebook/Photo)
ఒక కేరెక్టర్ చేస్తే అందులో కమల్ కనిపించడు. తనే ఆ పాత్రకు మౌల్డ్ అయిపోతాడు. మానసింగా, శారీరకంగా దాన్ని బాగా స్టడీ చేసి నటించడంలో కమల్ తర్వాతే ఎవరైనా. అలాంటి అంకిత భావం వున్న కొందరంటే కొందరు నటుల్లో కమల్ హాసన్ ఒకడు.(Twitter/Photo)
తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో ‘స్వాతి ముత్యం’,‘సాగర సంగమం’,‘ఇంద్రుడు చంద్రుడు’ వంటి సినిమాల్లో నటనకు మూడు నంది అవార్డులను అందుకున్న ఏకైక పరభాష నటుడిగా కమల్ హాసన్ రికార్డు (Youtube/Photo)
హిందీలో కూడా ‘ఏక్ దూజే కే లియే’, ‘గిరఫ్తార్’ ‘రాజ్ తిలక్’ వంటి పలు సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన కమల్ హాసన్ (Youtube/Photo)
‘విచిత్ర సోదరులు’ సినిమాలో పొట్టివాడిగా నటించిన కమల్ హాసన్.. దశావతారంలో మాత్రం అత్యంత పొడువైన వ్యక్తి పాత్రలో నటించి శభాష్ అనిపించుకున్నాడు. (Twitter/Photo)
1988లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పక విమానం అలాంటిదే. మూకీ కమ్ స్లాప్ స్టిక్ కామెడీగా ఈ మూవీ వండర్ క్రియేట్ చేసింది.(Facebook/Photo)
‘నాయకుడు’ చిత్రంలో కమల్ నటన స్టన్నింగా ఉంటుంది. బయోగ్రఫికల్ స్కెచ్ గా సాగే ఈ మూవీలో.. అన్ని వయసుల పాత్రలను అద్భుతంగా నటించి.. యూనివర్శల్ యాక్టర్ గా పేరు సాధించాడు కమల్ హాసన్. అందుకే ఈ సినిమా.. టైమ్ మాగ్జైన్ వారి ‘ఆల్ టైం బెస్ట్’ హండ్రెడ్ మూవీల్లో ఒకటిగా నిలిచింది.(youtube/Photo)
కమల్ హాసన్ తీరని కోరిక గా ‘మరుదనాయగం’ మిగిలే వుంది. మర్మయోగిగా ప్రేక్షకులు ముందుకు రావాలన్న ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే వుంది.(Twitter/Photo)
కమల్ హాసన్ కేవలం నటుడిగానే కాకుండా, ప్రొడ్యూసర్, డైరెక్టర్, సింగర్, లిరిక్ రైటర్ గా, ఇపుడు రాజకీయ నాయకుడిగా సేవలందిస్తున్నాడు. (Twitter/Photo)
కమల్ హాసన్ నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాలకు ఎక్కువగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. (Twitter/Photo)
కమల్ తన కెరీర్లో.. మొత్తం 171 అవార్డులు పొందాడు. అందులో 18 ఫిలిం ఫేర్ లున్నాయి. ఉత్తమ బాల నటుడిగా ఒకటి, ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు. ఆసియా ఫిలిం ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్ గానూ నిలిచాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలను.. ఆస్కార్ అవార్డుకు పంపించారు. భారతదేశంలో మరే నటుడికీ ఈ గౌరవం దక్కక పోవడం గుర్తించాల్సిన విషయం.(File Photo)