త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. తన మాటలతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడంలో ఈ తరంలో త్రివిక్రమ్ తర్వాత ఎవరైనా.. ఎంత పెద్ద భావాన్నానైనా తన మాటలతో సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూటే వేరు. అందుకే ఆయన మాటల మాంత్రికునిగా ప్రేక్షకుల గుండెల్లో కొలువైయ్యారు. (Twitter/Photo)
త్రివిక్రమ్ పూర్తి పేరు ‘ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ’. త్రివిక్రమ్ సినిమాలకెళ్తే కొన్న టికెట్ కు సరిపడా వినోదం గ్యారెంటీ. డైలాగ్ లో పదును.. పంచ్ లో కసి.. కలిపి కొట్టడంలో ఎక్స్ పర్ట్. విజువల్ ఎంత రిచ్ గా వుంటుందో.. డైలాగ్స్ అంత పొదుపుగా వుంటాయి. కేవలం కొన్నంటే కొన్ని మాటలతో.. ఆడియన్స్ ను కన్విన్స్ చేయడం త్రివిక్రమ్ స్పెషాలిటీ. ఓ నైస్ పంచ్ తో హాలంతా నవ్వులు పూయించడంలో త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా. (twitter/Photo)
నిజానికి త్రివిక్రమ్ లోని దర్శకుడి కంటే ఆయనలోని రచయత అంటేనే ఆడియన్స్ కు మక్కువ. త్రివిక్రమ్ సినిమా చూస్తున్నంత సేపు మనసు హాయిగా ఫీలవుతుంది.తనదైన మాటల మాయాజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ....1972 నవంబర్ 7న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. (Twitter/Photo)
త్రివిక్రమ్ మాటలు థియోటర్లలో తూటాలై పేలాయి. కేవలం పదునైన పంచ్ డైలాగులతో సినిమాలను హిట్ రేంజ్ కు తీసుకెళ్లిన రైటర్ గా పేరు గడించారు. జంధ్యాల ఆ రేంజ్లో అభిమానులకు సంపాదించుకున్న దర్శక, రచయత త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జై చిరంజీవా’ సినిమాకు మాటల రచయతగా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (twitter/photo)
ఎన్టీఆర్‌కు ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన త్రివిక్రమ్. త్రివిక్రమ్ మూవీల విషయానికొస్తే.. ఈయన సినిమాలను ప్రేమిస్తాడు...ఆరాధిస్తాడు. రచయతగా మొదలైన ఆయన సినీ ప్రయాణం దర్శకుడిగా మలుపు తిరిగింది. డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఫస్ట్ పిక్చర్ ‘నువ్వే నువ్వే’. తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో క్లాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. (Twitter/Photo)
ఒక సాధారణ విషయానికి కామన్ ఆడియన్స్ ఎలా స్పందిస్తారో. ఆయన సినిమాలోని పాత్రలు అలాగే మాట్లాడుకుంటాయి. ఇవే రచయతగా ఆయన్ని సాధారణ ప్రేక్షకులకు దగ్గరైయ్యేలా చేసింది. చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడాన్ని మాటల్లో మలచడంలో త్రివిక్రమ్ స్టైలే వేరు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘అతడు’ చిత్రం మోడ్రన్ తెలుగు మూవీ ఎలా వుండాలో తెలిపేలా ఉంటుంది. డైలాగ్స్ అంటే అతడులో త్రివిక్రమ్ రాసినట్టుండాలి అన్న టాకొచ్చింది. (twitter/Photo)
త్రివిక్రమ్ సినిమా ఆల్వేస్ సేఫ్ జోన్ లో వుంటుంది. దర్శకరచయిత కావడంతో.. ఇటు డైరెక్షన్లో తేడా వచ్చినా.. రైటర్ గా దాన్ని కవర్ చేస్తాడు.వందేళ్ల జీవితాన్ని కూడా 100 అక్షరాల్లో రాయగల సమర్ధుడు ఆయన పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించిన ‘జల్సా’ సినిమాతో దర్శకుడిగా గురితప్పినా.. మాటల రచయతగా ఏమాత్రం ఫెయిల్ కాలేదు.(Twitter/Photo)
ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన జులాయితో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. తేరగా లక్షరూపాయాలు తెచ్చే లాటరీ టిక్కెట్టు కూడా కష్టపడ్డ రూపాయితోనే కొనాలంటాడు. ఖాళీగా తిరిగేవాడు జులాయి కాదు. లక్ష్యం లేకుండా తిరిగేవాడే జులాయి అని మరో సారి తన పెన్ పవరేంటో చూపాడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సన్నాఫ్ సత్యమూర్తి, ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ సినిమాతో హాట్రిక్ హిట్స్ నమోదు చేసారు.(twitter/Photo)
ఇక పవన్ కళ్యాణ్‌తో చేసిన అజ్ఞాతవాసితో విమర్శపాలైనా.. ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాతో గోడకు కొట్టిన బంతిలా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కేక పుట్టించారు. త్వరలో మహేష్ బాబుతో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. కానీ ఈ సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. . (Twitter/Photo)