అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టిన నవ మన్మథుడు నాగార్జున. చైన్ పట్టుకుంటే మాస్ హీరోలా శివమెత్తగలడు. అదే చేత్తో పువ్వు పట్టుకుంటే క్లాస్ హీరోగా ప్రేమను కురిపించగలడు. అన్నమయ్య గా భక్తి గీతాలు ఆలపించినా... శిరిడిసాయి గా మైమరిపించినా.. అది నాగార్జునకు మాత్రమే సాధ్యం అనేలా చేసారు. నేడు నాగార్జున పుట్టినరోజు. (Twitter/Photo)
నాగార్జునకు యువతలో మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో క్రేజ్ తెచ్చిన మూవీ గీతాంజలి. మణిరత్నం తెలుగులో డైరెక్ట్ గా తీసిన ఒకే ఒక్క మూవీ గీతాంజలి కావడం విశేషం. ఈ సినిమా టెక్నికల్ గా తెలుగులో ఒక వండర్ క్రియేట్ చేసింది. ఇందులో నాగార్జున పండించిన నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేసిందనే చెప్పాలి. మణి దర్శక ప్రతిభకు, నాగార్జున నటన మిళితమై వెండితెరపై ఓ అజరామర దృశ్య కావ్యంగా ఆవిష్కృతమైంది. (Twitter/Photo)
టాలీవుడ్ లో ట్రెండ్ తో సంబంధం లేకుండా కొత్తవారికి ఛాన్స్ లివ్వడంలో నాగార్జున ఎప్పడు ముందుంటాడు. తన సినిమాలతో ప్రయోగాలు చేయడంలో నాగ్ వెనకాడలేదు. ఇండస్ట్రీకి న్యూటాలెంట్ ను పరిచయం చేసేలా ఎంకరేజ్ చేసింది. నాగార్జున ఇంట్రడ్యూస్ చేసిన రామ్ గోపాల్ వర్మ, వైవియస్.చౌదరి, రాఘవ లారెన్స్,ధశరథ్,కళ్యాణ్ కృష్ణ 'వైల్డ్ డాగ్’ మూవీతో సాల్మన్నుదర్శకుడిగా పరిచయం చేసారు. (Twitter/Photo)
పద కవితా పితామహుడు అన్నమాచార్యుడి అవతారంలో నాగార్జున వెండితెరపై మనోహర నటనను ప్రదర్శించాడు. కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ హోల్ ఏ.పి.ని భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. అప్పటి వరకు రొమాంటిక్, యాక్షన్ హీరో పాత్రలే వేసిన నాగార్జున తొలిసారి వెంకటేశ్వర స్వామి భక్తుడైన అన్నమయ్య గా మెప్పించారు. (Youtube/Credit)
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నిన్నేపెళ్లాడతా సినిమాకు గాను నిర్మాతగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత యేడాది విడుదలైన అన్నమయ్య చిత్రానిక నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు నాగార్జున. తెలుగులో నాగార్జున తరం హీరోల్లో మరే కథానాయకుడు జాతీయ స్థాయి అవార్డులు అందుకోలేదనే చెప్పాలి. (Twitter/Photo)
నటుడిగానే కాకుండా సక్సెస్ ఫుల్ నిర్మాతగా నాగార్జున రాణించాడు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన నిన్నేపెళ్లాడతా, మన్మథుడు, మాస్, రాజన్న చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయ డమరుకం మోగించి ప్రొడ్యూసర్ గా నాగార్జున సత్తా చాటాయి. (Twitter/Photo)
ఇటు మాస్, భక్తి చిత్రాలే కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసారు నాగార్జున. ఈ కోవలో వచ్చిన నిన్నేపెళ్లాడతా, సంతోషం, మన్మథుడు వంటి చిత్రాలు నాగార్జునను లవర్ బాయ్ గా ప్రజెంట్ చేశాయి. లవ్ ఎంటర్ టేనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాలు ..నాగార్జునకు అగ్రహీరో స్థాయిని కట్టబెట్టాయి. (Twitter/Photo)
విభిన్న పాత్రలతో అటు క్లాస్ ...ఇటు మాస్ ప్రేక్షకులకు దగ్గరైయ్యారు నాగార్జున. సినిమా సినిమాకి వైవిధ్యమైన నటనను కనబరిచి అందరి మన్ననలు అందుకున్నాడు నాగ్. మన్మథుడు సినిమాతో హోల్ తెలుగు ఇండస్ట్రీలో మన్మథుడంటే నాగార్జున అనే విధంగా అమ్మాయిలందరిని తన మాయలో పడేసారు. ఇప్పటికీ చెక్కచెదరని గ్లామర్ తో నేటి యంగ్ హీరోలకు సవాలు విసురుతున్నారు. (Source: Twitter)