HBD Pooja Hegde: హ్యాపీ బర్త్ డే పూజా హెగ్డే.. టాలీవుడ్ ప్రేక్షకుల ప్రేరణ ఈ అరవింద..

Happy Birthday Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా సత్తా చూపుతున్న ఈ భామ త్వరలో అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో పలకరించబోతుంది.