Happy Birthday Director Shankar | సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. దక్షిణాది సినిమాలతో హోల్ ఇండియా మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శంకర్ పుట్టినరోజు నేడు. అంతేకాదు ఇప్పటి వరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించిన ఈ దర్శకుడు.. తొలిసారి డైరెక్ట్‌గా రామ్ చరణ్‌తో నిర్మిస్తోన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. (Twitter/Photos)
అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభమైన శంకర్ కెరీర్, జెంటిల్ మేన్ మూవీతో డైరెక్టర్ గా టర్న్ తీసుకుంది. జెంటిల్ మేన్ అప్పటి వరకూ సౌత్ ఇండియా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. శంకర్ డైరెక్షన్ కు, యాక్షన్ కింగ్ అర్జున్ నటనతోపాటు.. రెహమాన్ మ్యూజిక్ కూడా తోడు కావడంతో.. జంటిల్మెన్ ఒక రేంజ్ హిట్ సాధించింది. .(Youtube/Credit)
‘భారతీయుడు’ మూవీలో కమలహాసన్‌ను రెండు విభిన్న గెటప్‌లలో చూపించి మెప్పించారు శంకర్. ఈ సినిమా ద్వారా కమల్ మూడో సారి జాతీయ అవార్డు సాధించాడంటే, ఆ ఘనత శంకర్ దే. ఎంత గొప్ప నటులైనా వారిలోని యాక్టింగ్ టాలెంట్ పూర్తిగా బయటపడేది దర్శక ప్రతిభతోనే...ఆ టెక్నిక్ తెలిసిన బెస్ట్ డైరెక్టర్ శంకర్. (Youtube/Crdit)
రాజకీయాలపై శంకర్ తీసిన ‘ఒకే ఒక్కడు’ సంచలనమే సృష్టించింది. ఒక రోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాయకులు కరెప్షెన్కు దూరంగా.. నీతివంతమైన పాలన అందిస్తే దేశం అభివృద్ధి పథాన పయనిస్తుందని అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించి వావ్ అనిపించారు. (Twitter/Photo)
శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘అపరిచితుడు’ సినిమా మనుషుల్లో నిద్రాణంగా దాగిపోయిన అపరిచితుడిని తట్టి లేపింది. ప్రజలు క్షమశిక్షణతో ఉండాలని ఈ సినిమా చెప్పింది. ఒక వేళ క్రమశిక్షణ లేకపోతే వారిని గరుడ పురాణంలో చెప్పినట్టు దండించాలని ప్రేక్షకులకు కొత్తగా చెప్పాడు శంకర్. ఈ చిత్రంలో విక్రమ్.. తన నటనతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. అపరిచితుడులో మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడే హీరోని సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆవిష్కరించి సక్సెస్ సాధించాడు.(Youtube/Credit)
ఇండియన్ ఫిల్మ్ మేకర్లెవరూ అడుగుపెట్టని ‘స్టాన్ విన్స్ టన్’ యానిమేషన్ స్టూడియోలో శంకర్ తన రోబోకు మెరుగులద్దారు. ‘టెర్మినేటర్’, ‘జురాసిక్ పార్క్’, ‘అవతార్’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల యానిమేషన్ వర్క్స్ ఈ స్టూడియోలోనే జరిగాయి. స్టాన్ విన్స్ టన్లో షూటింగ్ జరుపుకున్న తొలి భారీతీయ చిత్రంగా శంకర్ ‘రోబో’ రికార్డ్ క్రియేట్ చేసింది. (Twitter/Photo)
రజనీకాంత్, ఐశ్వర్యరాయ్, విలన్ రోబో రజనీలు పాల్గొన్న భారీ క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ఇక్కడే జరిగింది. హీరో రజనీకాంత్ తో పోరాడటానికి 100రోబోలు వరుసగా వస్తాయి. వీటిని యానిమేట్రిక్స్ టెక్నాలజీతో ఈ స్టూడియోలోనే రూపొందించారు. ఇలా తన చిత్రాలకు హాలీవుడ్ రేంజ్ ట్రీట్ మెంట్ ఇచ్చిన డైరెక్టర్ గా శంకర్ పేరు సాధించారు. (Twitter/Photo)
శంకర్ ఇపుడు రామ్ చరణ్‌తో తెరకెక్కించేబోయే సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాయ్స్’లో నటించారు. అంతేకాదు ఎ.ఆర్.రెహమాన్ దగ్గర పలు సినిమాలకు థమన్ అసిస్టెంట్‌గా పనిచేసారు. ఈ రకంగా శంకర్‌కు థమన్‌కు మంచి అనుబంధమే ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. (Shankar Thaman)
దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణించాడు శంకర్. అభిరుచి గల నిర్మాతగా కొన్ని ఉత్తమ చిత్రాలు నిర్మించి విజయాలందుకున్నాడు. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్స్ కు డైరెక్టర్లుగా ఛాన్సులిచ్చి వారిని తీర్చిదిద్దిన క్రెడిట్ శంకర్ కే దక్కుతుంది. సౌతిండియాలో ఇలాంటి కొత్త ట్రెండ్ కు తెరలేపిన దర్శకుడు శంకర్.రీసెంట్గా దర్శకుడిగా 28 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. 28 ఏళ్ల కెరీర్లో శంకర్...తమిళంలో 12 సినిమాలు, హిందీలో ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. ఇపుడు తెలుగులో రామ్ చరణ్.. హిందీలో రణ్వీర్ సింగ్‌తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. (Twitter/Photo)