డిసెంబర్ 21న టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్యూట్ హీరోయిన్ తమన్నా భాటియా పుట్టిన రోజు . ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లైనా ఇప్పటికీ చిన్న పిల్లలా కనిపిస్తుంది తమన్నా. అది కేవలం ఆమెకు మాత్రమే సాధ్యం. ఈ రేంజ్ పోటీలో కూడా ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూనే ఉంది ఈ భాటియా బేబీ. అప్పుడెప్పుడో 2005లోనే తెలుగు ఆడియన్స్కు హలో చెప్పింది తమన్నా. అప్పట్నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాల వరకు నటించింది కూడా.
ఇన్నేళ్ళలో స్టార్ హీరోలందరితోనూ నటించింది. చిరంజీవితో సహా మెగా హీరోలందరితోనూ నటించింది తమన్నా. దాంతో పాటు కుర్ర హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా అందరితోనూ రొమాన్స్ చేసింది తమన్నా. అయితే ఇన్నేళ్ళ కెరీర్లో తమన్నా దాదాపు 10 సినిమాలకు పైగానే రిజెక్ట్ చేసింది. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం..