సూపర్ స్టార్ కృష్ణ, అమితాబ్ బచ్చన్ 60వ దశకంలో హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ 1965లో విడుదలైన ‘తేనే మనుసులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ తెలుగులో తొలి కలర్ సాంఘిక చిత్రం. ఇక అమితాబ్ బచ్చన్.. 1969లో కే.ఏ.అబ్బాస్ దర్శకత్వంలో‘సాత్ హిందూస్థానీ’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక బిగ్‌బీ హీరోగా నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం. (File/Photo)
అటు కృష్ణ తొలి సినిమా తర్వాత ఎన్నో బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో నటించారు. ఆ సంగతి పక్కన పెడితే.. అమితాబ్ బచ్చన్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. ఎన్టీఆర్ సహా పలువురు హీరోలు అమితాబ్ సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా బిగ్‌బీ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసారు. (File/Photo)
కృష్ణ హీరోగా నటించిన ‘కుమార్ రాజా’ మూవీ హిందీలో అమితాబ్ ‘మహాన్’గా రీమేక్ చేసాడు. తెలుగులో కశ్మర్ నేపథ్యంలో తెరకెక్కిస్తే.. హిందీలో నేపాల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ ఈ సినిమాను ముందుగా కన్నడలో రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘శంకర్ గురు’ సినిమాకు రీమేక్. 1978లో విడుదలైన ఈ సినిమాను కృష్ణ అదే యేడాది ‘కుమార్ రాజా’ గా రీమేక్ చేసి విడుదల చేసారు. మరోవైపు అమితాబ్ ఈ చిత్రాన్ని 1983లో రీమేక్ చేసారు. (Twiter/Photo)