HBDKrishna: సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో కీలక ఘట్టాలు ఇవే..

తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ప్రస్తుతం ఆయన తనయుడు మహేష్ బాబు..సూపర్ స్టార్ నట వారసత్వాన్ని టాలీవుడ్‌లో కొనసాగిస్తున్నాడు.ఈయన హీరోగా పరిచయమై 55 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ నట ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్..