సుమన్ | టాలీవుడ్ విషయానికొస్తే.. సీనియర్ హీరో సుమన్ కూడా పోర్నోగ్రఫీ కేసులో కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు. అయితే ఈ కేసులో ఆయన్ని అక్రమంగా ఇరికించినట్టు తేలడంతో ఆయన నిర్ధోషిగా విడుదలయ్యారు. అప్పటికే హీరోగా ఆయనకు జరగాల్సిన నష్టం జరిగింది. తెలుగు సహా మిగతా దక్షిణాది పరిశ్రమలో సుమన్ ఒక్కరే జైలు జీవితం గడపాల్సి రావడం దురదృష్టకరం. ఇక బాలీవుడ్లో జైలు జీవితం గడిపిన సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. (Photo Twitter)
దలేర్ మెహందీకి మానవ అక్రమ రవాణ కేసులో పాటియాలా కోర్టు ఇది వరకే రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత దలేర్ మెహందీ బెయిల్ పై విడుదలయ్యారు. రీసెంట్గా పాటియాల కోర్టు ఆ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వడంతో పంజాబ్ పోలీసులు దలేర్ మెహందీని అదుపులోకి తీసుకున్నారు.2003లో దలేర్ మెహందీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు అయింది. (file/Photo)
ఆర్యన్ ఖాన్ | బాలీవుడ్ హై ప్రోఫైల్ కేసులో ఇదొకటి. బాలీవుడ్ బాద్షా తనయుడు ఆర్యన్ ఖాన్ కొన్ని రోజులు ఆర్ధర్ రోడ్ జైల్లో గడిపారు. ఈయన ముంబైలోని క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ వాడుతూ దొరికాడంటూ పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు. చివరకు ఈ కేసులో ఆర్యన్ ఖాన్ నిర్ధోషి అంటూ కోర్టు కేసు కొట్టేసింది. (Twitter/Photo)
రాజ్ కుంద్రా | బాలీవుడ్లో ప్రస్తుతం రాజ్ కుంద్రా వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయా అని అంతా వణికిపోతున్నారు. ముంబైలో పోర్నోగ్రఫీ రాకెట్ ఇంతగా పెరిగిపోయిందా.. ఈ స్థాయిలో పాకిపోయిందా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తంగా ఈ కేసు పుణ్యామా అంటూ రాజ్ కుంద్రా జైల్లో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన దాదాపు 60 రోజులు వరకు జైల్లో ఉండాల్సి వచ్చింది.
సంజయ్ దత్ | బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్..1993లో ముంబై బాంబ్ పేలుళ్లతో పాటు అక్రమాయుధాలు కలిగియున్న కేసులో జైలు శిక్ష అనుభవించారు. బాంబే కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఐదేళ్లకు కుదించింది. చివరకు తన మంచి ప్రవర్తన కారణంగా 8 నెలల ముందే జైలు నుంచి విడుదలయ్యారు. (Image: Reuters)