అవసరం కొందరికి దారి చూపిస్తే.. సాధించాలనే తపన మరికొందరికి మార్గం చూపిస్తుంది. షారుఖ్ ను మాత్రం ఆ రెండూ కలిసి నడిపించాయి. కొన్ని టీవీ సీరియళ్లతో యాక్టింగ్ స్టార్ట్ చేసిన షారుఖ్.. బాలీవుడ్ సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. అంతటి స్థాయి ఊరకే రాలేదతనికి. రెండు దశాబ్దాల హార్డ్ వర్క్ రిజల్డది. (News18/Creative)
షారుఖ్ ఖాన్... ఈ పేరు కంటే బాలీవుడ్ బాద్ షా,కింగ్ ఖాన్,, కింగ్ ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఆఫ్ రొమాన్స్..అంటేనే ఇపుడు ఎక్కువ పాపులర్. ఇన్ని కొత్త ట్యాగ్ లు అతనొక్కడివే. షారుఖ్ లోని వైవిధ్యమైన నటుడుకి ఇచ్చిన పేర్లవి. షారుఖ్ ఖాన్ కు యష్ రాజ్ ఫిలింస్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. డర్ సినిమాతో మొదలైంది.. వారిద్దరి టై అప్. (News18/Creative)
రిలీజైన ఫస్ట్ మూవీతోనే సంచలనం మొదలైంది. మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన అతని కెరియర్.. తిరుగులేని స్థాయికి ఎదిగింది. సినిమాల్లోకి రాకముందు కొన్ని టీవీ సీరియళ్ల యాక్టింగ్ తో పేరు తెచ్చుకున్నాడు షారుఖ్. అతనికి ఫస్ట్ చాన్స్ ఇచ్చింది మాత్రం హేమామాలిని. ఆమె డైరెక్షన్ చేసిన దిల్ ఆశ్నా హై.. సినిమా.. కొన్ని కారణాలు వల్ల రిలీజ్ లేటయింది. సెకండ్ చాన్స్ గా ‘దీవానా’ లో ఆఫర్ వచ్చింది. రిషికపూర్, దివ్యభారతిలతో పాటు సపోర్టింగ్ రోల్ అది. ఆ సినిమాతోనే లైఫ్ టర్న్ అయింది. (News18/Creative)
ఆ సినిమాలో అతని యాక్టింగ్ కు బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. అలా బాలీవుడ్లో అతని ప్రస్థానం మొదలైంది. అదే ఏడాది అతనికి వరుస ఆఫర్లు వచ్చాయి. రాజు బన్ గయా జెంటిల్మన్, చమత్కార్ వంటి సినిమాలు చేసారు. అవేవి అతనికి పేరు సంపాదించలేకపోయినా.. ఆఫర్లు మాత్రం తగ్గించలేదు. కానీ నటించిన ప్రతి సినిమాలోనూ తన టాలెంట్ కు పదునుపెట్టాడు. అదే అతనికి చాన్స్ లు వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. (News18/Creative)
వేర్ దేర్ ఈజ్ ఎ విల్.. దేర్ ఈజ్ ఎ వే. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఇదే షారుఖ్ సక్సెస్ రహస్యం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ఎవరి సపోర్ట్ లేదు. అయినా.. సాధిస్తాననే నమ్మకం. అతను అదృష్టాన్ని నమ్ముకునే వ్యక్తి కాదు. హార్డ్ వర్క్ ను నమ్మేవాడు. అందుకోసం ప్రతిరోజూ కష్టపడేవాడు. వచ్చిన ఏ అవకాశాన్ని షారుఖ్ వదులుకోలేదు. 1965 నవంబర్ 2 న ఢిల్లీలోని పఠాన్ ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు షారుఖ్. అతని తండ్రి తాజ్ మహమ్మద్ ఖాన్, తల్లి లతీఫ్ ఫాతిమా. (News18/Creative)
షారుఖ్ 15 ఏళ్లున్నపుడు తండ్రి క్యాన్సర్ తో మరణించాడు. అతని తల్లి కూడా జబ్బుపడి 1990 లో చనిపోయింది. షారుఖ్ కు పేరేంట్స్ తో ఎక్కువ అటాచ్ మెంట్ ఉండేది. వాళ్ల మరణం అతని లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అయింది. కష్టపడే తత్వాన్ని అప్పటినుంచే నేర్చుకున్నాడు ఖాన్. షారుఖ్.. ఢిల్లీలో ఉండగానే గౌరీని ప్రేమించాడు. ఆమె హిందూ ఫ్యామిలీకి చెందింది. టీవీ సీరియళ్లలో యాక్ట్ చేయడం కోసం.. సినిమా అవకాశాల కోసం ముంబయి కి షిఫ్ట్ అయ్యాడు. షారుఖ్ కు సినిమాల్లో నటించడం ఇష్టముండేది కాదు. కానీ గౌరిని పెళ్లి చేసుకోవాలంటే.. ఆమె ఫ్యామిలీకి తానేంటో నిరూపించి ఒప్పించాలనే సినిమా చాన్స్ ల కోసం తిరిగాడు. 1991 లో గౌరిని పెళ్లి చేసుకున్నాడు షారుఖ్. (Image: AFP)
‘దీవానా’ సినిమా తర్వాత.. అతనికి బ్రేక్ ఇచ్చిన సినిమాలు బాజీఘర్, డర్. ఈ రెండు సినిమాల్లోనూ అతను నెగెటివ్ క్యారెక్టర్లో యాక్ట్ చేసారు. అప్పటివరకూ బాలీవుడ్లో నడిచిన హీరోయిజం ట్రెండ్ కు చెక్ చెప్పాడు. నెగెటివ్ క్యారెక్టర్ తోనూ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయవచ్చని నిరూపించాడు. హీరోయిన్ను చంపడం ఆడియెన్స్ కు పెద్ద షాక్ గా అనిపించింది. బాజీఘర్, అతని యాక్టింగ్ టాప్ రేంజ్ లో ఉంటుంది. (News18/Creative)
డర్ సినిమాలోనూ అతని క్యారెక్టర్ డిఫరెంటే. ఆ సినిమాలో సన్నిడియోల్, జూహిచావ్లా హీరో, హీరోయిన్లు. షారుఖ్.. ప్రేమోన్మాదిగా కనిపిస్తాడు. ప్రేమకోసం.. శాడిస్ట్‌లా మారతాడు. ఆ పర్ఫామెన్స్ కూడా ఆడియెన్స్ ను కదిలించింది. అప్పటివరకూ ఉన్న ట్రెండ్ ను మార్చాడు షారుఖ్. రిస్క్ ఎక్కువని తెలిసినా అలాంటి క్యారెక్టర్లనే సెలెక్ట్ చేసేవాడు. ఇక తన జనరేషన్లో ఉత్తమ నటుడిగా ఎక్కువ ఫిలింఫేర్లు అందుకున్న నటుడిగా రికార్డులకు ఎక్కాడు. . (News18/Creative)
ఒక్క 95 లోనే షారుఖ్ నటించిన 7 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే ఒక బ్లాక్ బస్టర్ మూవీ. నెగెటివ్, కామెడీల నుంచి ఫుల్ రొమాన్స్ వైపు తన క్యారెక్టర్లను సెలెక్ట్ చేయడం మొదలెట్టాడు ఖాన్. డీడీఎల్.. ఆల్ టైమ్ గ్రేట్ మ్యూజికల్ హిట్. షారుఖ్ నటన యువతుల హృదయాల్ని కొల్లగొట్టింది. అప్పటి నుంచే షారుఖ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు షారుఖ్. (Twitter/Photo)
ఒకానొక దశలో బాలీవుడ్లో ఎక్కువ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసిన హీరోగా రికార్డు.. ఇక 1996 షారుఖ్ నటించిన 4 సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. 97 లో రిలీజైన ‘దిల్ తో పాగల్ హై’ సినిమాతో మళ్లీ టాప్ రేంజ్ కు చేరాడు ఖాన్. డీడీఎల్ తర్వాత ఆ స్థాయిలో మళ్లీ హిట్ కొట్టిన సినిమా ఇది. దిల్ తో పాగల్ హై కూడా పెద్ద మ్యూజికల్ హిట్. ఈ సినిమాలో షారుఖ్ నటనకు ఫిల్మ్ ఫేర్ దక్కింది. (News18/Creative)
యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రల్ని కూడా వెతికి మరీ పట్టుకుంటాడు షారుఖ్. అలాంటి స్టోరీలు దొరికితే ఫెయిల్యూర్స్ ని కూడా లెక్కచేయడతను. అందుకే అతని సినిమాల్లో వైవిధ్యం కనిపిస్తుంది. దిల్ తో పాగల్ హై హిట్ తర్వాత ఏడాదిలో రెండు బిగ్ హిట్స్ కొట్టాడీ రొమాంటిక్ బాయ్. దిల్ సే తో ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలో నటించాడు. బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితాన్ని మాత్రం అందించలేదు. (News18/Creative)
షారుఖ్ ఖాన్ కెరీర్లో 70 కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రతి సినిమాలో అతని నటన డిఫరెంట్. క్యారెక్టర్ సెలెక్షన్ లో వేరియేషన్ చూపిస్తుంటాడు షారుఖ్. రోమాంటిక్ సినిమాలనే కాదు.. అన్ని రకాల పాత్రలు చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. బాలీవుడ్ బాద్షా గా ఎదిగాడు. ప్రస్తుతం ఈయన వరుస ఫ్లాపులతో షారుఖ్ కెరీర్ గ్రాఫ్ మందగించింది. (Twitter/Photo)
షారుఖ్ మూవీ కెరీర్లో ఎన్నో అద్భుత చిత్రాలు.. వాటిలో దేవదాస్ వంటి పీరియడిక్ రొమాన్స్ కూడా ఉంది. దేవదాస్ క్యారెక్టర్ కు హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి గొప్ప క్యారెక్టర్ ను కూడా పండించాడు షారుఖ్. ఆ క్యారెక్టర్ నుంచి బయటపడేందుకు 6 నెలలు గ్యాప్ తీసుకున్నాడు ఖాన్. ఆ టైంలో ఎలాంటి షూటింగుల్లో పార్టిసిపేట్ చేయలేదు. (Image: Yogen Shah)
షారుఖ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ పొందిన మరో సినిమా స్వదేస్. సైంటిస్ట్ గా షారుక్ నటించాడిందులో. సినిమా బిగ్ హిట్ కాకపోయినా.. షారుఖ్ నటన మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుఖ్ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. 2005 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది. 14 ఫిలింఫేర్ అవార్డులు అతన్ని వరించాయి. షారుఖ్ సినిమాలకు ఇంటర్నేషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 12 సినిమాలు వంద కోట్లకు పైగా వసూలు చేసాయి. ఒకప్పుడు 30 కి పైగా బ్రాండ్ల యాడ్స్ లో నటించి సత్తా చాటారు. (Image: Reuters)
ఫిలింఫేర్ అవార్డులకు మొత్తం 30 సార్లు నామినేట్ అయ్యాడు షారుఖ్. అందులో 14 సార్లు ఆ అవార్డును గెలిచాడు. అలనాటి మేటి నటుడైన దిలీప్ కుమార్ తో సమానంగా ఫిలింఫేర్ అవార్డులు సాధించిన ఏకైక నటుడు షారుఖ్. అమితాబ్ డాన్ సినిమా రీమేక్ లో డాన్ గా యాక్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. ఏషియన్ బెస్ట్ యాక్టర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు షారుఖ్. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ డాన్ గా మీడియా అతన్ని రిఫర్ చేస్తోంది. క్రీడాకారులకు స్పూర్తినిచ్చే పాత్రలో నటించాడు షారుఖ్. చక్ దే ఇండియాలో.. అతని నటనకు విమర్శకులు కూడా ముగ్దులయ్యారు. కోచ్ కబీర్ ఖాన్ క్యారెక్టర్లో అతను జీవించాడు. ఈ సినిమాలోని చక్ దే ఇండియా పాట దేశంలోని అన్ని రకాల క్రీడాకారుల్లో జోష్ నింపింది. (Image: Reuters)
హీరో కాకముందు పలు టీవీ సీరియళ్లలో నటించిన ఖాన్.. ప్రస్తుతం కెరీర్ పరంగా చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు కొడుకు ఆర్యన్ ఖాన్ పై డ్రగ్స్ కేసులలతో షారుఖ్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నెక్ట్స్ ‘పఠాన్’, జవాన్ సినిమాలతో పాటు రాజ్ కుమార్ హిరానీతో ‘డంకీ’ సినిమాలు చేస్తున్నారు. (Twitter/Photo)