బాలీవుడ్ సినిమాల ట్రెండ్ మార్చిన బాద్షా అతను. ఒక్కో అవకాశాన్ని.. ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ..నంబర్ వన్ పొజిషన్‌కు చేరిన.. కింగ్ ఆఫ్ బాలీవుడ్. అమ్మాయిల మనసుదోచుకున్న కింగ్ ఆఫ్ రొమాన్స్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిన కింగ్ ఖాన్. బాలీవుడ్లో ఎలాంటి సపోర్టింగ్ లేకుండా నెంబర్ హీరోగా ఎదిగి...హిందీ చిత్ర సీమ రికార్డులను తిరగరాసిన సామ్రాట్. తన ఇంటిపేరునే కింగ్ గా మార్చుకున్న షారుఖ్ ఖాన్ బర్త్ డే. ఈ రోజు 55వ ఏట అడుగుపెట్టాడు. (AFI/Photo)
‘డర్’ సినిమాలోనూ అతని క్యారెక్టర్ డిఫరెంటే. ఆ సినిమాలో సన్నిడియోల్, జూహిచావ్లా హీరోహీరోయిన్లు. షారుఖ్.. ప్రేమోన్మాదిగా కనిపిస్తాడు. ప్రేమకోసం.. శాడిస్ట్‌లా మారతాడు. ఆ పర్ఫామెన్స్ కూడా ఆడియెన్స్‌ను కదిలించింది. అప్పటివరకూ ఉన్న ట్రెండ్‌ను మార్చాడు షారుఖ్. రిస్క్ ఎక్కువని తెలిసినా అలాంటి క్యారెక్టర్లనే సెలెక్ట్ చేసేవాడు. (Twitter/Photo)
1995 లో షారుఖ్ సినీ లైఫ్ లో గోల్డెన్ మూమెంట్ స్టార్టయింది. అప్పటివరకూ నెగెటివ్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించిన షారుఖ్.. రొమాంటిక్ హీరో అవతారం ఎత్తాడు. 1995 లో సల్మాన్ తో కలిసి ‘కరణ్ అర్జున్’ సినిమాలో నటించాడు షారుక్. పాజిటివ్ రోల్లో షారుఖ్ కనిపించి హిట్టయిన ఫస్ట్ మూవీ అది. ఆ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. అటు నెగెటివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు.. పాజిటివ్ ఫ్యాన్స్ కూడా పెరిగారు. (Twitter/Photo)
డీడీఎల్.. ఆల్ టైమ్ గ్రేట్ మ్యూజికల్ హిట్. షారుఖ్ నటన యువతుల హృదయాల్ని కొల్లగొట్టింది. అప్పటి నుంచే షారుఖ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు షారుఖ్. ఈ మూవీ ఇప్పటికీ ముంబాయిలోని మరాఠా మందిర్‌లో చాలా ఏళ్ల పాటు నడించింది. ఈ సినిమా రీసెంట్గా 25 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. (Twitter/Photo)
షారుఖ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ మూవీ ‘కుచ్ కుచ్ హోతా హై’. ఈ సినిమాకు కూడా ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. షారుఖ్ ఖాన్ కెరీర్లో 80కి పైగా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత ‘మొహబ్బతే’, ‘కల్ హోనా హో’ ‘స్వదేశ్’, పరదేశి, ‘రబ్ దే బనాది జోడి’ వంటి సినిమాలు నటుడిగా షారుఖ్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. (Twitter/Photo)
షారుఖ్ మూవీ కెరీర్లో ఎన్నో అద్భుత చిత్రాలు.. వాటిలో ‘దేవదాస్’ వంటి పీరియడిక్ రొమాన్స్ కూడా ఉంది. దేవదాస్ క్యారెక్టర్‌కు హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి గొప్ప క్యారెక్టర్‌ను కూడా పండించాడు షారుఖ్. ఆ క్యారెక్టర్ నుంచి బయటపడేందుకు 6 నెలలు గ్యాప్ తీసుకున్నాడు ఖాన్.(Shah Rukh Khan)
షారుఖ్ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. 2005 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది. 15 ఫిలింఫేర్ అవార్డులు అతన్ని వరించాయి. షారుఖ్ సినిమాలకు ఇంటర్నేషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 12 సినిమాలు వంద కోట్లకు పైగా వసూలు చేసాయి. ప్రస్తుతం 10 పైగా బ్రాండ్ల యాడ్స్ లో నటిస్తున్నాడు. (Twitter/Photo)