Home » photogallery » movies »

HAPPY BIRTHDAY SAMANTHA RUTH PRABHU MEMORABLE ROLES OF SAMANTHA FROM YE MAYA CHESAVE JESSIE TO FAMILY MAN RAJI SR

Happy Birthday Samantha Ruth Prabhu : సమంత కెరీర్‌లో మెమరబుల్ రోల్స్.. జెస్సీ నుంచి రాజీ వరకు..

Happy Birthday Samantha Ruth Prabhu : సమంత.. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతున్నారు.  నటిగా సమంత.. ఫిబ్రవరి 25తో  (శుక్రవారం)తో 12 యేళ్ల  కెరీర్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ పన్నెండేళ్ల కాలంలో సమంత ఎన్నో సూపర్  హిట్ చిత్రాల్లో నటించారు. దాంతో పాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.  సమంత మొదటి తెలుగు సినిమా..నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేశావే’. ఈ సినిమాలో జెస్సీ..గా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ముఖ్యంగా అప్పటి యూత్ జెస్సీ మాటలకు, ఆమె అందానికి పడి పోయి..ఆ సినిమాను పదే పదే చూసిన సందర్బాలున్నాయి.