Happy Birthday Rebel Pan India Star Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. ఆ తర్వాత ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక వచ్చే సంక్రాంతికి రాధే శ్యామ్ అంటూ అలరించబోతున్నారు. అంతేకాదు త్వరలో ఆదిపురుష్‌లో శ్రీరాముడిగా కనిపించనున్నాడు. (Twitter/Photo)
ఈ శని వారం ఈ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 42వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. 2020లో ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఈ యేడాది మాత్రం ప్రేక్షకులు ముందుకు రాలేదు. ఇపుడు 2021లో ‘రాధే శ్యామ్’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్.. ‘విక్రమాదిత్యగా, రాధే శ్యామ్‌గా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. (Twitter/Photo)
2004లో వర్షం మూవీతో మొదటి బ్రేక్. ‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ...2004లో చేసిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్ సినీకెరీర్‌ను మలుపు తిప్పింది. హీరోగా ప్రభాస్‌కు మూడో సినిమా. ఈ మూవీతో ప్రభాస్ తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు ‘రాఘవేంద్ర’ అనే మాస్ సినిమాతో పలకరించినా.. ఈ మూవీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. (Twitter/Photo)
19ఏళ్ల కెరీర్లో పందొమ్మిది సినిమాలు చేసిన రెబల్ స్టార్ ప్రభాస్. ఒక పక్క మిస్టర్ ఫర్ఫెక్ట్గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనే.. మరో పక్క మిర్చిలా రికార్డుల ఘాటును పెంచారు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తాడు. ‘ఈశ్వర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘ఛత్రపతి’తో యాక్షన్ హీరోగా...‘బుజ్జిగాడు’తో మాస్ హీరోగా అలరించి...‘బాహుబలి’తో హాలీవుడ్ వరకూ తన సత్తా చాటాడు ప్రభాస్. (Twitter/Photo)
ప్రభాస్ సినీ కెరీర్లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ‘చత్రపతి’. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌ను యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ‘ఛత్రపతి’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. సెంటిమెంట్ ను కూడా అదే స్థాయిలో పండించి మెప్పించాడు ప్రభాస్. ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాతో ప్రభాస్ డైలాగ్ డెలివరీ పూర్తిగా మారిపోయింది. (Twitter/Photo)
బిల్లా మూవీతో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు ప్రభాస్. ఈ సినిమాలో డబుల్ రోల్ తో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. అండర్ వరల్డ్ డాన్ గా కనిపించాడు. మాస్ పాత్రలు మాత్రమే కాకుండా ‘డార్లింగ్’ వంటి డిఫరెంట్ మూవీస్ చేశాడు. అప్పటి వరకు ప్రభాస్ లోని మాస్‌ను మాత్రమే చూసిన ప్రేక్షకులు ఈ సినిమాతో.. ప్రభాస్‌లోని నటుడిని చూశారు.
తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్ కి చేర్చిన సినిమా ‘బాహుబలి’. ఇందులో బాహుబలిగా ప్రభాస్ యాక్షన్ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగింది. రెబల్ స్టార్ పేరు హాలీవుడ్ వరకూ వెళ్లింది. ఇక బాహుబలి 2 పార్ట్‌తో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాడు. (Twitter/Photo)
రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ప్రభాస్ రెండు సినిమాల్లో నటించాడు. బిల్లా, రెబల్ లాంటి మాస్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించకపోయినా.. వీళ్లిద్దరి కలిసి నటించడం ఫ్యాన్స్‌కు ఆనందాన్నిఇచ్చింది. ఇపుడు రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్‌లో పెదనాన్న కృష్ణంరాజు కీలకపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. (Twitter/Photo)
పంతొమ్మిదేళ్ల సినీ కెరీర్లో ‘సాహో’ తో కలపి ఇప్పటి వరకు పందొమ్మిది సినిమాలు చేసాడు. హిందీలో అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘యాక్షన్ జాక్సన్’లో గెస్ట్ రోల్ చేసాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండే పాత్రలతో ప్రేక్షకుల మదిలో డార్లింగ్‌గా, ‘ఛత్రపతి’గా, ‘బాహుబలి’గా చెరగని ముద్రవేసాడు. (Twitter/Photo)
ఈ మధ్య హీరోయిన్ పూజా హెగ్డే పుట్టిన రోజు ఆమె స్పెషల్ బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రభాస్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేయబోతున్నారు. విక్రమాదిత్య అంటే ఎవరు అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. టీజర్లో దీనికి సమాధానం చెప్పబోతున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో బాగా ఆలోచిస్తున్నారు ప్రభాస్.