తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తమ్ముడు మహేష్ బాబుతో కలిసి ‘ముగ్గురు కొడుకులు’ చిత్రంలో కలిసి నటించిన రమేష్ బాబు. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ నటించిన ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాకు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా హిందీలో ధర్మేంద్ర హీరోగా నటించిన ‘యాదోంకి బారాత్’ మూవీకి రీమేక్. (Twitter/Photo)