Happy Birthday Rajinikanth: ఎన్టీఆర్, అమితాబ్, చిరంజీవి సహా వేరే హీరోలతో రజినీకాంత్ మల్టీస్టారర్ చేసిన మూవీలు ఇవే..
Happy Birthday Rajinikanth: ఎన్టీఆర్, అమితాబ్, చిరంజీవి సహా వేరే హీరోలతో రజినీకాంత్ మల్టీస్టారర్ చేసిన మూవీలు ఇవే..
Happy Birthday Rajinikanth: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన క్రేజ్ కేవలం తమిళంకే పరిమితం కాలేదు. దక్షిణాదికి చెందిన తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకుల్లో తలైవాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు తెలుగుతో పాటు హిందీలో పలువురు అగ్ర కథానాయకులతో మల్టీస్టారర్ మూవీస్ చేసి ఇండియాకే సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.
వేరే అగ్ర కథానాయకులతో రజినీకాంత్ మల్టీస్టారర్ మూవీస్ (Twitter/Photos)
2/ 26
అన్న ఎన్టీఆర్‌తో కలిసి ‘టైగర్’ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్న రజినీకాంత్ (Youtube/Credit)
3/ 26
మోహన్ బాబు హీరోగా నటించిన ‘పెదరాయుడు’లో ఆయన తండ్రి పాపారాయుడిగా నట విశ్వరూపం చూపించిన సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్న ఎన్టీఆర్. (Twitter/Photo)
4/ 26
నట భూషణ శోభన్ బాబుతో కలిసి ‘జీవన పోరాటం’ సినిమాలో కలిసి నటించిన రజినీకాంత్ (Twitter/Photo)
5/ 26
సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘ఇద్దరూ అసాధ్యులే’, అన్నదమ్ముల సవాల్’, రామ్ రాబర్ధ్ రహీమ్’ చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ (Twitter/Photo)
6/ 26
మెగాస్టార్ చిరంజీవితో ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ సినిమాలతో పాటు ‘మా పిళ్లై’ సినిమాల్లో కలిసి నటించిన రజినీకాంత్ (Twitter/Photo)
7/ 26
మమ్ముట్టి తో కలిసి దళపతిలో నటించిన రజినీకాంత్ (Twitter/Photo)
8/ 26
రజినీకాంత్‌తో బాలకృష్ణ నటించలేదు. కానీ మోహన్ లాల్ మాత్రం రజినీకాంత్ హీరోగా నటించిన ‘కుచేలన్’లో నటించారు. ఈ సినిమా తెలుగులో ‘కథానాయకుడు’గా తెరకెక్కింది. (Twitter/Photo)
9/ 26
అమితాబ్ బచ్చన్‌తో ‘అంధా కానూన్’తో పాటు ‘గిరఫ్తార్’ తో పాటు హమ్ సినిమాల్లో కలిసి నటించిన రజినీకాంత్. ఈ చిత్రంలో గోవిందా మరో హీరోగా నటించారు. (Twitter/Photo)
10/ 26
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టితో కలిసి ‘దర్బార్’ మూవీలో కలిసి నటించిన రజినీకాంత్ (Twitter/Photo)
11/ 26
అక్షయ్ కుమార్‌తో కలిసి రోబో సీక్వెల్ ‘2.0’ మూవీ చేసాడు రజినీకాంత్. రజినీకాంత్ ఒక్క అక్షయ్‌తోనే కాదు పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
12/ 26
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి రజినీకాంత్..‘అందా కానూన్’, ‘గిరఫ్తార్’, ‘హమ్’ సినిమాల్లో కలిసి నటించారు.
13/ 26
హమ్’ సినిమలో అమితాబ్, గోవిందాలతో రజినీకాంత్.
14/ 26
షారుఖ్.. ‘చైన్నై ఎక్స్‌ప్రెస్’ లో రజినీకాంత్ ఫ్యాన్‌గా నటించాడు. మరోవైపు షారుఖ్ హీరోగా నటించిన ‘రా..వన్’ మూవీలో తలైవా గెస్ట్ రోల్లో మెరిసాడు.
15/ 26
‘భగవాన్ దాదా’ మూవీలో బాల నటుడిగా రజినీతో కలిసి నటించిన హృతిక్ రోషన్.
16/ 26
‘ఆతంక్ హి ఆతంక్’ మూవీలో కలిసి నటించిన రజినీకాంత్, అమీర్ ఖాన్. హాలీవుడ్ మూవీ ‘గాడ్ ఫాదర్’ క రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
17/ 26
‘బులంది’ మూవీలో అనిల్‌కపూర్‌తో కలిసి నటించిన రజినీకాంత్. ఈ సినిమా పెదరాయుడు మూవీకి రీమేక్.
18/ 26
‘చాల్బాజ్’ మూవీలో సన్నిడియోల్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న తలైవా.
19/ 26
ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, జాకీ ష్రాఫ్ తదితర హీరోలతో పలు మల్టీస్టారర్ మూవీలు చేసిన రజినీకాంత్.
20/ 26
రజినీకాంత్, జగపతి బాబు కలిసి ‘కథానాయకుడు’తో పాటు ‘లింగ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. (Twitter/Photo)
అన్న ఎన్టీఆర్, మోహన్ బాబులతో రజినీకాంత్.. చిత్రంలో కే.రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు (File/Photo)
23/ 26
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో యాక్షన్ కింగ్ అర్జున్ (File/Photo)
24/ 26
దివంగత అంబరీష్‌తో కలిసి ఒకటి రెండు చిత్రాల్లో నటించిన రజినీకాంత్ (File/Photo)
25/ 26
దివంగత కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్తో కలిసి ‘శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహాత్యం’ సినిమాతో పాటు పలు చిత్రాల్లో కలిసి నటించారు. (Twitter/Photo)
26/ 26
కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌తో కలిసి ‘పోలీస్ బుల్లెట్’ అనే కన్నడ, తమిళ సినిమాలో కలిసి నటించారు రజినీకాంత్. ఈ సినిమాను తెలుగులో నాగార్జున, రవిచంద్రన్ హీరోలుగా ‘శాంతి క్రాంతి’ పేరుతో ఒకేసారి తెరకెక్కించారు రవిచంద్రన్. (Twitter/Photo)