Happy Birthday Purijagannadh | డాషింగ్ పూరీ జగన్నాథ్ 20 ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడు అయ్యారు. వైకుంఠపాళీలో పాము నోట్లో పడ్టట్టు ఎన్నో ఫ్లాపులు చవిచూసాడు. ప్లాపులతో పనైపోయిందన్న టైమ్‌లో తిరుగులేని హిట్‌తో మళ్లీ సత్తా చాటడం దర్శకుడిగా పూరీ జగన్నాథ్ స్లైల్. నేడు ఇస్మార్ట్ దర్శకుడు పుట్టినరోజు. (Twitter/Photo)
తెలుగు ఇండస్ట్రీలో పడిలేచిన కెరటం దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఎన్నిసార్లు పడినా కూడా లేవడం ఈయన శైలి. ఇంకా చెప్పాలంటే జీరో అయ్యాడు అనుకున్న ప్రతీసారి హీరో అవుతుంటాడు. ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సినిమా తర్వాత పూరీ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు. రీసెంట్గా దర్శకుడిగా 21 ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. (Source: Twitter)
తెరపై అన్నిరసాలను సమపాళ్లలో చూపించే అసలుసిసలైన మాంత్రికుడు.... టైటిల్ కార్డు నుంచి పోస్టర్ వరకు అన్నీ వెరైటీగా చూపించి....ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే మ్యాజిక్ తెలిసిన మెజీషియన్... ఒక హీరోను తెరపై ఎలా ప్రజెంట్ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో తెలిసిన దర్శకుడు... పంచ్ డైలాగ్స్ తో మాస్ ఆడియన్స్‌తో క్లాప్స్ కొట్టించే స్టార్ డైరెక్టర్...పూరీ జగన్నాథ్. (Source: Twitter)
ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఏం కావాలి..? కథ, తారాబలం, డబ్బు, అదృష్టం, ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తారు. దర్శకుడు పూరీజగన్నాథ్ మాత్రం వేగం అంటారు. అనుకున్న సమయంలో ఓ సినిమాను పూర్తిచేయడమే గగనమవుతున్న ఈ రోజుల్లో... తక్కువ పని దినాల్లో సినిమా కంప్లీట్ చేయడం కత్తి మీద సామే. దాన్ని సాధ్యం చేసి చూపిస్తోన్న దర్శకుడు పూరీ జగన్నాథ్. (Source: Twitter)
పూరీ తన సినిమాలకు ఎక్కువ మటుకు తానే కథ రాసుకుంటారు. స్క్రిప్ట్ తయారు చేసుకుంటాడు...పంచ్ డైలాగులతో కేకపుట్టిస్తాడు.చిన్నతనం నుండి పూరీకి సినిమాల్లోకి రావాలని కోరిక...ఎలా రావాలో తెలియదు..అందుకే చదువు మధ్యలో ఆపేసి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇండస్ట్రీలో తెలిసినవారు లేకపోవడంతో ప్రవేశం దొరకలేదు...ఆ గ్యాప్ ను దూరదర్శన్‌లో సీరియల్స్ తీస్తూ కాలం గడిపాడు. (Source: Twitter)
1996లో తాను ఎన్నో ఏళ్లుగా కలలు గన్న అవకాశం వచ్చింది. కృష్ణ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం చేసే ఛాన్స్ దొరికింది. ‘థిల్లానా’టైటిల్‌తో తెరకెక్కిన సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేసినా ఏవో కారణాల వల్ల ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఒక వేళ ఈ సినిమా విడుదలై ఉన్నుంటే ఇప్పటికే దర్శకుడి 25 ఏళ్లు అయివుండేది. (facebook/Photo)
‘బద్రి’ తర్వాత జగపతిబాబు హీరోగా, పూరీ తీసిన ‘బాచి’ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆయన్ని ఒక్క సినిమాతో వెలిగిన దర్శకుడిగా టాలీవుడ్ అభివర్ణించింది. పవన్ వెనక నుంచి దర్శకత్వం చేయడంతో బద్రి హిట్ అయ్యిందని ఆయనను విమర్శించారు. ‘బాచి’తో పూరీ అసలు టాలెంట్ బయటకి వచ్చిందని కామెంట్ చేసారు. పూరీ వాటన్నింటినీ పాజిటివ్ గా... ఛాలెంజింగా తీసుకున్నారు.(Facebook/Photo)
అప్పటి వరకు సినిమాలు తీసి పెట్టమని వెంటపడ్డ నిర్మాతలు ‘బాచీ’ పరాజయంతో ముఖం చాటేసారు. చివరకు తనకు తెలిసిన సి.శేషురెడ్డి, కె.వేణుగోపాల్ రెడ్డి నిర్మాతలుగా ఆయన ఓ సాహసానికి నడుం బిగించాడు. అప్పటికే ...‘నీకోసం’ సినిమాలో హీరోగా నటించి...హీరోగా పనికిరాడని...సైడ్ హీరో రోల్ కే పనికివస్తాడని అందరూ విమర్శిస్తున్న రవితేజ హీరోగా ...పూరీ ఓ కథను ఎంపిక చేసుకున్నారు. వెరైటీ సబ్జెక్టు, వెరైటీ టైటిల్ తో ...‘ఇట్లు శ్రావణి,సుబ్రమణ్యం’ ...అంటూ సినిమా తీశారు...విమర్శించినవారి నోళ్లు మూతపడేలా ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. (Twitter/Photo)
‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ సక్సెస్ తర్వాత...పూరీ వైష్ణో అకాడమీ అనే బ్యానర్ ను స్థాపించారు. ఈ బ్యానర్ పై ‘ఇడియట్’ అనే నెగటివ్ టైటిల్ తో మళ్లీ రవితేజనే హీరోగా సినిమా తీశారు. ఈ సినిమా ఓ సెన్సెషనే క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రవితేజ మాస్ హీరోగా స్థిరపడ్డాడు. రవితేజ హీరోగా ఎస్టాబ్లిష్ కావడంలో పూరీ జగన్నాథ్ సినిమాలే కీ రోల్ పోషించాయి.(Source: Twitter)
ఇడియట్ ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్లీ రవితేజ నే హీరోగా పెట్టి ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తీశాడు..యాజ్ యూజ్ వల్ గా ఇదీ మంచి హిట్ కొట్టింది. ఇక నాగార్జునతో హీరోగా తీసిన ‘శివమణి’ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో నాగార్జున నా క్కొంచెం మెంటల్...అని చెప్పే డైలాగ్ నాగ్ కు మాస్ లో క్రేజ్ ను తీసుకొచ్చింది. (Facebook/Photo)
వరుస హిట్ల తర్వాత పూరీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన ‘ఆంధ్రావాలా’ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ సినిమాకి ముందు తారక్ నటించిన ‘సింహాద్రి’ సూపర్ హిట్ సాధించడం కూడా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచింది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. (Twitter/Photo)
‘ఆంధ్రావాలా’ తర్వాత పూరీ డైరెక్ట్ చేసిన ‘143’, ‘సూపర్’ అనుకున్నంత విజయం సాధించలేదు. ఇలా వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరీ ప్రిస్టేజియస్ గా తీసుకున్న ప్రాజెక్ట్ ‘పోకిరి’. మహేష్ బాబును మాస్ ఆడియన్స్ కు దగ్గర చేస్తూ ఓ డిఫరెంట్ టేకింగ్‌తో చేసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి...ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. ఈ సినిమా మహేష్ బాబును టాలీవుడ్లో తిరుగులేని సూపర్ స్టార్ గా నిలబెట్టింది. (Twitter/Photo)
‘బుడ్డాహోగా తేరా బాప్’ అంటూ అమితాబ్ హీరోగా హిందీ మూవీ డైరెక్ట్ చేశాడు. ఇది 2011లో విడుదలై సక్సెస్ సాధించింది. అమితాబ్ ను వెరైటీగా చూపించడంతో బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు పూరీ. అంతేకాదు ఈ సినిమా ఆస్కార్ ఆర్కైవ్స్ లో చోటు సంపాదించుకోవడం మరో విశేషం. హిందీలో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. అంతకు ముందు తుషార్ కపూర్‌తో పవన కళ్యాణ్‌తో తెరకెక్కించిన ‘బద్రి’ సినిమాను హిందీలో ‘షర్త్ ’పేరుతో రీమేక్ చేసారు పూరీ. (Twitter/Photo)
21ఏళ్లలో దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక ఇమేజ్. అంతేకాదు ప్రతి ఒక్క హీరోకు తన దర్శకత్వంలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన దర్శకుడు. 21 ఏళ్ల కెరీర్లో దర్శకుడిగా తెలుగు, కన్నడ, హిందీలో కలిపి 37 చిత్రాలు. అప్పట్లో ఆగిపోయిన పూరీ,మహేష్ జనగణమణ సినిమాను మళ్లీ తెరకెక్కించే ఆలోచనలో పూరీ జగన్నాథ్. మహేష్ బాబు కూడా పూరీతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. (Twitter/Photo)