Happy Birthday Pierce Brosnan: జేమ్స్ బాండ్ హీరో పియర్స్ బ్రాస్నన్ బర్త్ డే స్పెషల్..

ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు వచ్చాయి. ఇపుడీ సిరీస్‌లో 25వ సినిమా తెరకెక్కుతోంది. అందులో బాండ్‌గా తనదైన ముద్ర వేసిన నటుల్లోపియర్స్ బ్రాస్నన్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. 1995 నుంచి 2002 వరకు వచ్చిన ‘గోల్డెన్ ఐ’, టుమారో నెవర్ డైస్’, ది వరల్డ్ ఈజ్ నాట్ఎనఫ్ లాంటి సినిమాల్లో తనదైన ముద్రవేసాడు.