అందులో భాగంగా నయనతార తమిళ్లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా ఈరోజు ఆమె తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో అభిమానులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటించింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతున్నారు. తాజాగా ఆమె నెట్రికన్ అనే సినిమాలో నటించారు. Photo : Twitter
'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించి తన నటనతో అదరగొట్టింది. కంటి చూపు లేని యువతి తన వినికిడి శక్తిని ఉపయోగించి సైకో కిల్లర్ ను ఎలా పట్టుకుంది అనేదే కథ. ‘గృహం’ చిత్ర దర్శకుడు మిలింద్ రావ్ ఈ సినిమాకు దర్శకుడు. కొరియన్ చిత్రం ‘బ్లైండ్’కు రీమేక్‌గా వచ్చింది. Photo: Twitter
సమంత ఈ సినిమాలో మరో హీరోయిన్గా చేస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకుడు. మరోవైపు నయన ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి వెబ్ సిరీస్‌లో నయన్ కీలకపాత్రలో కనిపించనుందని తాజా సమాచారం. Photo: Twitter