Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తూ అదరగొడుతోన్న అందాల నటి. నయనతార ఇటూ హీరోయిన్గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. Instagram
అందులో భాగంగా.. నయన్.. తమిళ్లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తాజాగా నయన్ మరో లేడి ఓరియెంటేడ్ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. షార్ట్ ఫిలిం మేకర్ నవకాంత్ రాజ్ కుమార్ చెప్పిన కథ విని, నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నయన్. అది అలా ఉంటే విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయమైంది నయనతార. Photo: Twitter
ఆ తర్వాత వరుసగా తెలుగు టాప్ హీరోల సరసన నటించి అదరగొట్టింది. ఓ వైపు గ్లామర్ పాత్రలను పోషిస్తూనే.. పౌరానికాల్లోను నటిస్తూ అదరగొట్టింది నయన్. అందులో భాగంగా బాపు దర్శకత్వంలో, బాలయ్య సరసన 'శ్రీరామరాజ్యం'లో సీత పాత్ర చేసి.. అచ్చం సీత అంటే ఇలాగే ఉంటుందా? అనేలా యాక్ట్ చేసిందీ బ్యూటీ. ఆమె ఇటీవల అలాంటీ మరో సినిమాలో నటించింది. అదే ‘మూకుత్తి అమ్మన్’. Photo: Twitter