Happy Birthday Natural Star Nani: రేడీయో జాకీ కెరీర్ స్టార్ట్ చేసి.. ఆపై అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా చివరకు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాతో పరిచయమయ్యారు నాని. ఆ సినిమా విడుదలైనపుడు నాని ఇంత పెద్ద హీరో అవుతాడని ఎవరు అనుకోలేదు. ఈ రోజు నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా నాని నట ప్రస్థానంపై న్యూస్ 18 స్పెషల్.. (Twitter/Photo)
సినీ ఇండస్ట్రీలో ఏ అండ లేకుండా వచ్చిన నాని.. ఆ తర్వాత రోజుల్లో సంచలనాలు సృష్టిస్తున్నారు. చిరంజీవి, రవితేజ తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్న నటుడు నాని. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు. అప్పటికే శీనువైట్లతో ఢీ.. బాపు రాధాగోపాలం సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసి దర్శకత్వం కోసం కథ సిద్ధం చేసుకుంటున్నారు. (Twitter/Photo)
12 యేళ్ల కెరీర్లో హీరోగా 27చిత్రాల మైలురాయిని అందుకున్న నాచురల్ స్టార్ నాని. ఘంటా నవీన్ బాబు అనే కుర్రాడు.. నాని పేరుతో వెండితెరకు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. పుష్కర కాలంలో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సెల్ఫ్ మేడ్ స్టార్‌గా నాచురల్ స్టార్ అనే బిరుదును పొందాడు. (Twitter/Photo)
అది సెప్టెంబర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుదలైంది. అసలు విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబట్టి. కలర్స్ స్వాతి తప్ప మరో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవరున్నారో తెలియదు. కానీ విడుదలైన తర్వాత సంచలన విజయం సాధించి ఆ కుర్రాన్ని అందరికీ పరిచయం చేసింది ఆ చిత్రం. ఆ కుర్రాడే మనం ఇప్పుడు ముద్దుగా న్యాచురల్ స్టార్ అని పిలుచుకుంటున్న నాని. (Twitter/Photo)
ఎటో వెళ్లిపోయింది మనసు".. "పైసా".. "ఆహాకళ్యాణం".. "జెండా పై కపిరాజు" ఇలా వరస సినిమాలయితే చేసాడు కానీ హిట్లు మాత్రం అందుకోలేదు నాని. టాలెంటెడ్ హీరోకు విజయాలు లేకుండా పోయాయే అని నాని పరిస్థితి చూసి బాధ పడిన వాళ్లు కూడా లేకపోలేదు. అలాంటి టైమ్‌లో వచ్చిన సినిమా "ఎవడే సుబ్రమణ్యం". 2015 మార్చ్ 21న విడుదలైంది ఈ చిత్రం. (Twitter/Photo)
ఆ తర్వాత "కృష్ణార్జున యుద్ధం", ‘దేవదాస్’ సినిమాలతో ఫ్లాపులు ఇచ్చినా.. ఆ తర్వాత జెర్సీ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రంతో తాను ఎంత గొప్ప నటున్ని అనే సంగతి మరోసారి నిరూపించాడు నేచురల్ స్టార్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా పర్వాలేదనపించింది.(Nani Jersey movie)
. నాని .. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు షూటింగ్ కంప్లీట్ కావడంతో చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌తో పాటు జూన్ 10న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
13 ఏళ్ల సినీ జీవితంలో 27 చిత్రాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రేడీయో జాకీ కెరీర్ స్టార్ట్ చేసి.. ఆపై అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా చివరకు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాతో పరిచయమయ్యారు నాని. ఆ సినిమా విడుదలైనపుడు నాని ఇంత పెద్ద హీరో అవుతాడని ఎవరు అనుకోలేదు. (Twitter/Photo)