HBD Ram Charan: తండ్రి మెగాస్టార్ చిరంజీవితో రామ్ చరణ్ అరుదైన ఫోటోలు..

Happy Birthday Mega Power Star Ram Charan | మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చిరుతగా తెరంగేట్రం చేసి తండ్రి తగ్గట్టే మగధీరగా నిలిచాడు. అందుకే మెగాభిమానుల గుండెల్లో నాయక్‌గా నిలిచాడు. వీళ్లిద్దరు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కలిసి నటించలేదు. కానీ రామ్ చరణ్ నటించిన ‘మగధీర’,‘బ్రూస్లీ’ సినిమాల్లో చిరంజీవి గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తే.. రామ్ చరణ్ తండ్రి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ లో ఓ పాటలో అతిథిలా మెరిసాడు. ఇపుడు ఆచార్యలో పూర్తి స్థాయిలో కలిసి నటించారు. మే 13న ఈ సినిమా విడుదల కానుంది.