ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియుడు వుండడు, సినిమా ప్రేమికుడు వుండడు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని.చిత్రపరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ’ఇళయరాజా’. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943, జూన్ 2 లో తమిళ్ నాడు లోని తేని జిల్లాలో పన్నియపురంలో జన్మించారు.
1943 జూన్ 2 న తమిళనాడు లోని తేని జిల్లా, పన్నైపురమ్ గ్రామంలో.. రామస్వామి, చిన్నతాయమ్మాల్ దంపతులకు మూడో కుమారుడిగా జన్మించిన ఇళయరాజా.. ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు వుండరు. సినిమా ప్రేమికులు కూడా వుండరు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. 1970కి ముందు శ్రోతలు మధురమైన సంగీతాన్ని విన్నారు. 1970 ఎంటర్ అయిన తర్వాత సినిమా సంగీతం ధోరణి కొద్ది కొద్దిగా మారుతూ వచ్చింది. మధురం స్థానంలో కొంత మాస్ మసాలా కూడా తోడైంది. కమర్షియల్ సినిమాలు, కమర్షియల్ పాటల ప్రాధాన్యత పెరిగింది. (Twitter/Photo)
తల్లి దండ్రులు పెట్టిన పేరు జ్ఞాన దేశికన్.. తమిళ చిత్రాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఇళయరాజా, మ్యూజిక్ డైరెక్టర్ గా తొలిచిత్రం తమిళంలో తెరకెక్కిన ‘అన్నక్కలి’. 1970 తర్వాత ఓ ఐదారు సంవత్సరాలు ఒకే తరహా పాటలు వినిపించాయి. ఆ టైమ్‌లోనే ఇళయరాజా అనే ఓ కొత్త సంగీత తరంగం సంగీత ప్రేమికుల వీనులకు తాకింది. తెలుగులో ‘భద్రకాళి’ చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఇళయరాజా మెల్ల మెల్లగా తన విభిన్నమైన వాయిద్యాలతో కొత్త తరహా స్వరాలను సంగీతాభిమానులకు స్లో పాయిజన్‌లా ఎక్కించడం మొదలు పెట్టాడు. (Twitter/Photo)
తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 1976 లో సంగీత దర్శకుడిగా తమిళ్ లో మొదటిసినిమా ’అన్నకిలి’ చేస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత పంచు అరుణాచలం ఆయనని ’ఇళయ’ (అంటే చిన్నవాడు అని తమిళ్లో అర్థం) అని పిలిచేవాడు. ఆరోజుల్లో ఏ.యం. రాజా అని మరో సంగీత దర్శకుడు ఉండటంతో ఈ రెండుపదాలని కలిపి ఇళయారాజా అని స్క్రీన్ నేమ్ పెట్టారు. (Twitter/Photo)
ఇళయరాజాకు జాతీయ అవార్డులు వచ్చిన తెలుగు సినిమాలు సాగర సంగమం, రుద్రవీణ. ఇలా రెండు తెలుగు సినిమాలతో జాతీయ అవార్డులు అందుకున్న అరుదైన ఘనత ఇళయరాజాకు మాత్రమే దక్కింది. మాస్ పాటైనా, మెలోడీ సాంగ్ అయినా, సంగీత ప్రధానమైన పాటైనా ఇది ఇళయరాజా సాంగ్ అని సామాన్య శ్రోత కూడా గుర్తు పట్టేంత విభిన్నంగా అతని పాటలు వుండేవి. శాస్త్రీయ సంగీతానికి వెస్ట్రన్ మ్యూజిక్‌ని లింక్ చేసి ఎన్నో పాటలు స్వరపరిచి సంగీతం అంటే ఇదీ, పాటలంటే ఇవీ అని అందరిచేతా అనిపించారు. 1980 దశకంలో ఇళయరాజా సంగీతం అంటే చెవి కోసుకునేంతగా పాటలు వినేవారు.(Twitter/Photo)
చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలనూ మ్యూజికల్ హిట్స్ చేసిన ఘనత ఇళయరాజాది. అలాగే ఎ.ఆర్.రెహమాన్ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు మణిరత్నం సినిమాలన్నింటికీ ఇళయరాజాయే మ్యూజిక్ చేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తెలుగులో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గీతాంజలి’ పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. కమల్‌హాసన్, కె.విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఇళయరాజా కెరీర్లో మైల్స్టోన్స్గా చెప్పుకోవచ్చు. (Twitter/Photo)
2010 లో ‘పద్మభూషణ్’ పురస్కారం.. 2018లో కేంద్రం నుంచి పద్మవిభూషణ్ పురస్కారం.. పలు జాతీయ అవార్డులను అందుకున్న ఇసై జ్ఞానీ. తన 40 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. 1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రా తో ఒక పూర్తి స్తాయి ’సింఫనీ’ ని కంపోజ్ చేసారు. ఆసియా ఖండం లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. (Twitter/Photo)
తెలుగులో ‘గుండెల్లో గోదారి’, ‘శ్రీరామ రాజ్యం’, రుద్రమదేవి’ ‘ధోని’ ‘ఏటో వెళ్లిపోయింది మనసు’, ‘మనఊరి రామాయణం’ తర్వాత తర్వాత సంగీత దర్శకుడిగా గ్యాప్ వచ్చింది. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇళయరాజా ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా, కుమార్తె భవతారణి అయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకులుగా మారారు. ఏది ఏమైనా భారతీయ సినీ సంగీతంలో ఆయనో లెజండ్. (Twitter/Photo)