అటు ‘మిమీ’ చిత్రంలో సరోగేట్ మదర్‌గా నటించడానికి 15 కిలోలు బరువు పెరిగింది. మళ్లీ ఆ బరువు తగ్గేందుకు చాలా కష్టపడింది. ఈమె అక్షయ్ కుమార్‌తో నటించిన ‘బచ్చన్ పాండే’ సినిమా బాలీవుడ్ లో మరో డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. త్వరలోకార్తీన్ ఆర్యన్‌తో కలిసి ‘షెహజాదా’ మూవీతో పలకరించనుంది. (Photo Credit : Instagram)
కృతి సనన్.. 27 జూలై 1990లో న్యూ ఢిల్లీలో జన్మించారు. ఇక కృతి సనన్ వాళ్ల నాన్న రాహుల్ సనన్.. ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్.. తల్లి గీతా సనన్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. ఈమె ఎలక్ట్రానిక్స్ టెలీ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ నుంచి సినిమాల్లో అడుగుపెట్టింది. ఈమె చెల్లెలు నుపుర్ సనన్ త్వరలో రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.