Krithi Shetty: తెలుగు ఇండస్ట్రీకి ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తోంది. ఈ రోజు ఆ అమ్మడు బర్త్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు. (Twitter/Photo)
కృతి శెట్టి తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. 21 సెప్టెంబర్ 2003లో జన్మించింది. కానీ ఈమె పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే. వీళ్ల నాన్న ప్రముఖ బిజినెస్ మ్యాన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్‌గా పలు సినిమాలకు పని చేసారు. అంతేకాదు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. (Krithi shetty Photo : Instagram)
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు డిమాండ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని చూస్తారు చాలా మంది నటీనటులు. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది కృతి శెట్టి. ’ఉప్పెన’ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే యూజ్ చేసుకుంటోంది. (Instagram/Photo)