Happy Birthday Kareena Kapoor | పూర్ నట వారసురాలిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన కరీనా కపూర్...ఆ తర్వాత ఆమె కంటూ సెపరేట్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. దాదాపు ఒక దశాబ్ధం పాటు నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కరీనా..2012లో తోటి నటుడు సైఫ్ అలీ ఖాన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లై ఇద్దరు బిడ్డలకు తల్లైనా...ఇప్పటికీ సినిమాల్లో తన సత్తా చూపిస్తూనే ఉంది. ఈ రోజు ఈ భామ 41వ పుట్టినరోజు జరుపుకుంటుంది.
పెళ్లికి ముందు ‘గుడ్ న్యూస్’ వంటి సినిమాలో నటించి మెప్పించినా ఈ భామ.. త్వరలో ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాతో పలకరించనుంది. ఈ సనిమా ఈ యేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనే ఆలోచన ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య మరో ఇంపార్టెంట్ రోల్లో నటించారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. (Twitter/Photo)
అసలు పటౌడీ ఖాన్దాన్ కోడలై ఉండి కూడా ఇప్పటికీ అదే స్థాయిలో అందాలు ఆరబోయడం.. సినిమాల్లో హాట్ సీన్స్తో రెచ్చిపోవడం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ ముద్దుగుమ్మ దూకుడుకు భర్త సైఫ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చేసాడు. దాంతో శ్రీవారే సై అన్న తర్వాత ముందు వెనక చూసుకోకుండా అందరికీ అన్ని అందాలు చూపిస్తుంది కరీనా కపూర్. తనకు నచ్చితే బికినీ వేయడం కాదు.. ముద్దుల్లో కూడా ముంచడానికి రెడీ అంటుంది కరీనా. అడిగితే ఇట్స్ ఆల్ ఇన్ ది పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ అంటూ కబుర్లు చెబుతుంది. (Instagram/Photo)