Global Star Ram Charan | మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. గతేడాది రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా తన నటనతో ఆకట్టుకొని ఇపుడు నాటు నాటు పాటతో అంతర్జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని గ్లోబర్ స్టార్‌గా ఎదిగారు. ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా న్యూస్ 18 ప్రత్యేక కథనం.. (Twitter/Photo)
రామ్ చరణ్ విషయానికొస్తేనన ‘చిరుత’గా తెలుగు చలన చిత్రసీమలో అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. గతేడాది రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టి బాక్సాఫీస్ రికార్డులను ఎన్టీఆర్‌తో కలిసి తిరగ రాసాడు. అంతేకాదు ఇపుడు లోకల్ స్టార్‌గా ఉన్న రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో గ్లోబల్ స్టార్‌గా సత్తా చాటుతున్నారు. (Twitter/Photo)
1985 మార్చి 27న చెన్నైలో జన్మించిన రామ్ చరణ్. మెగాస్టార్ నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిరుత’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి సినిమా ‘చిరుత’తో తండ్రి తగ్గ తనయుడిగా.. డాన్సుల్లో, ఫైట్స్‌లో చిరంజీవి నట వారసుడు అనిపించుకున్నారు.(Twitter/Photo)
కెరీర్ మొదట్లో ఒక మూసలో సినిమాలు చేసిన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా ఈ మెగా వారసుడు నటుడే కాదన్నారు. అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు నటుడంటే ఇలా ఉంటాడురా అనిపించారు. చిరంజీవికి తగ్గ తనయుడు కాదు.. ప్రయోగాలంటే భయపడతాడు అన్నారు.. కానీ ఇప్పుడు కొత్త కథలు ఉంటే ఆయన రెడీ అంటూ దర్శకులే ఎగబడుతున్నారు.(Twitter/Photo)
తన కుటుంబ సభ్యులైన తండ్రి చిరంజీవి తల్లి సురేఖ, భార్య ఉపాసనతో రామ్ చరణ్. సినిమాలతో పాటు రామ్ చరణ్ తన కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. అలా ఫ్యామిలీ మ్యాన్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ఈ యేడాదే ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది. అంతేకాదు ఈ యేడాదే రామ్ చరణ్ తండ్రి కాబోతుండటంతో మెగాభిమానులు డబుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. (Twitter/Photo)
ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘చిరుత’ అప్పట్లోనే దాదాపు రూ. 20 కోట్ల వరకు వసూలు చేసి రామ్ చరణ్ కెరీర్‌కు పూల బాటలు వేసింది. ఆ తర్వాత రాజమౌళి వచ్చి ఏకంగా రామ్ చరణ్ బాధ్యత తీసుకున్నాడు. మగధీర సినిమాతో కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న రామ్ చరణ్ అప్పటి వరకు ఉన్న 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర రికార్డులను తిరగరాసాడు. తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి రూ. 75 కోట్ల మార్క్ అందుకున్న హీరోగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసాడు.
ఆరెంజ్ సినిమాతో నటుడిగా నిరూపించుకున్నా.. తొలి ఫ్లాప్ అందుకున్నాడు. అయితే వెంటనే రచ్చ, నాయక్, ఎవడు లాంటి మాస్ సినిమాలతో మళ్లీ విజయాలు అందుకున్నాడు మెగా వారసుడు. కానీ ప్రయోగాలు చేయడనే విమర్శలు మాత్రం అందుకున్నాడు. మాస్ సినిమాలు.. రొటీన్ కథలు చేస్తాడంటూ చరణ్ కెరీర్‌తో ఆడుకున్న వాళ్లు కూడా ఉన్నారు. (Twitter/Photo)
బ్రూస్లీ లాంటి ఫ్లాపులు వెంటబడినా ధృవ సినిమాతో విజయం అందుకున్నారు. ఇక నాలుగేళ్ల క్రితం వచ్చిన రంగస్థలం సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులకు చెక్ పెట్టాడు రామ్ చరణ్. ఈ సినిమాతో అప్పటి వరకు చరణ్ నటనపై ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంతో రూ.125 కోట్ల షేర్ మార్క్ అందుకున్నారు చరణ్.(Twitter/Photo)
రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘RRR’ సినిమా ‘రౌద్రం రణం రుధిరం’ హీరోగా రామ్ చరణ్ గతేడాది పుట్టినరోజు ముందు విడుదలై సంచలన విజయం సాధించింది. మన దేశం నుంచి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న పూర్తి స్థాయి భారతీయ చిత్రంగా రికార్డులను తిరగరాసింది.ఈ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా రూ. 630 కోట్ల షేర్.. (రూ. 1240 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా రామ్ చరణ్‌కు 15వ సినిమా. ఈ సినిమాకు సర్కారోడు’, సిటిజన్, సీఈవో’ సేనాని, సేనాపతి, CEO, సైనికుడు. అధికారి, సహా అర డజనుకు పైగా పేర్లను పరిశీలనలో ఉన్నాయట. ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మరికొన్ని గంటల్లో టైటిల్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 14 యేళ్ల కెరీర్లో దాదాపు 14 చిత్రాల్లో నటించిన రామ్ చరణ్.. మరో మూడు చిత్రాలు లైన్లో ఉన్నాయి. (Twitter/Photo)
శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్, సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు.శంకర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమా చేయనున్నాడు. అటు బింబిసార దర్శకుడు వశిష్ఠతో ఓ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. అటు కేజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో పాటు, విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్లతో చర్చలు జరుపుతున్నాడు. మొత్తంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ చరణ్‌కు న్యూస్ 18 బర్త్ డే విషెష్ తెలియజేస్తోంది.